Pratap Chandra Sarangi: దేశ పౌరులందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్

బీహార్ ఎన్నికల ఎన్నికల ( bihar election ) నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రజలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందజేస్తామని బీజేపీ (BJP) మేనిఫెస్టోలో ప్రకటించింది. ఇంకా తయారు కాని వ్యాక్సిన్‌ను ఎలా ఉచితంగా అందిస్తారంటూ ఎన్డీఏ కూటమిని విపక్షపార్టీలన్నీ చుట్టుముడుతున్నాయి. ఈ తరుణంలోనే కేంద్ర మంత్రి ప్రతాప్ చంద్ర సారంగి (Pratap Chandra Sarangi) కీలక ప్రకటన చేశారు.

Last Updated : Oct 26, 2020, 02:35 PM IST
Pratap Chandra Sarangi: దేశ పౌరులందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్

All Indians to get free coronavirus vaccine:  Minister Pratap Sarangi: భువనేశ్వర్: బీహార్ ఎన్నికల ఎన్నికల ( bihar election ) నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రజలకు ఉచితంగా కరోనా (Coronavirus) వ్యాక్సిన్ అందజేస్తామని బీజేపీ (BJP) మేనిఫెస్టోలో ప్రకటించింది. ఇంకా తయారు కాని వ్యాక్సిన్‌ను ఎలా ఉచితంగా అందిస్తారంటూ ఎన్డీఏ కూటమిని విపక్షపార్టీలన్నీ చుట్టుముడుతున్నాయి. ఈ తరుణంలోనే కేంద్ర మంత్రి ప్రతాప్ చంద్ర సారంగి (Pratap Chandra Sarangi) కీలక ప్రకటన చేశారు. దేశంలోని పౌరులందరికీ ఉచితంగా కొవిడ్-19 వ్యాక్సిన్ (coronavirus vaccine ) అందజేస్తామని పశుసంవర్ధక, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల  శాఖ మంత్రి సారంగి పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న బీహార్ రాష్ట్రంలోనే కాకుండా.. ప్రధాని నరేంద్రమోదీ దేశంలోని పౌరులందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ (free vaccine) ను అందజేస్తారని కేంద్రమంత్రి ప్రకటించారు. Also read: Coal block scam: కేంద్ర మాజీ మంత్రికి మూడేళ్ల జైలు శిక్ష‌

ఈ మేరకు కేంద్ర మంత్రి ప్రాప్ చంద్ర సారంగి బాలాసోర్ ఉప ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) దేశంలోని ప్రజలందరికీ వ్యాక్సిన్‌ను అందజేస్తారని ఆయన ప్రకటించారు. ప్రతీ వ్యక్తికి కొవిడ్ టీకా వేయడానికి ప్రభుత్వం రూ.500 ఖర్చు చేయనున్నట్లు  సారంగి తెలిపారు. అయితే ఒడిశా ఉప ఎన్నికల ప్రచారంలో ఆదివారం కేంద్ర మంత్రులు ప్రతాప సారంగి, ధర్మేంద్ర ప్రధాన్‌ (Dharmendra Pradhan) పాల్గొన్నారు. ఈ క్రమంలో ఒడిశా రాష్ట్ర ప్రజలకు వ్యాక్సిన్ అందించడంపై రాష్ట్ర మంత్రి ఆర్పీ స్వైన్ ప్రశ్నించారు. దీంతో కేంద్రమంత్రి స్పందిస్తూ.. దేశ పౌరులందరికీ కొవిడ్ వ్యాక్సిన్ అందజేస్తామని ప్రకటించారు. Also read: Bihar elections: ఎల్జేపీ అధికారంలోకి వస్తే నితీశ్ జైలుకే: చిరాగ్ పాశ్వాన్

అయితే.. ఎన్నికలు జరిగే బీహార్‌లో ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని బీజేపీ ప్రకటించడంపై ఇప్పటికే విపక్ష పార్టీలు బీజేపీపై ఫైర్ అవుతున్నాయి. ఇదిలాఉంటే.. తమిళనాడు, మధ్యప్రదేశ్, అసోం, పుదుచ్చేరి ప్రభుత్వాలు తమ రాష్ట్రాల ప్రజలకు కొవిడ్ వ్యాక్సిన్లను ఉచితంగా అందజేస్తామని ప్రకటించగా.. దేశ పౌరులందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. Also read: Bihar Assembly Elections: లాలూ విడుదలైన మరుసటి రోజే సీఎం నితీశ్‌కు వీడ్కోలు: తేజస్వీ

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News