ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. బుధవారం నాడు కొత్తగా 1,486 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 20,471కు చేరుకుంది. గత 24 గంటల్లో 49 మంది కరోనాతో చనిపోయారు. దీంతో ఇప్పటివరకు కరోనావైరస్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య 652కి చేరింది. దేశంలో ప్రస్తుతం 15,859 యాక్టివ్ కేసులు ఉండగా... 3,960 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ బుధవారం సాయంత్రం ఓ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. మహారాష్ట్రలో కరోనా ప్రభావం అధికంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ముంబైలోనే 3 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
1486 new cases in the last 24 hours and 49 deaths: Ministry of Health and Family Welfare https://t.co/TCC16aPcj2
— ANI (@ANI) April 22, 2020
Also read : Telangana: తెలంగాణలో 943కి చేరిన కరోనా కేసులు
దేశంలోనే అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన మహా నగరంగా ముంబై నిలిచింది. ముంబైలోనూ ధారావి ప్రాంతంలోనే కరోనా ప్రభావం అధికంగా కనిపిస్తున్నట్టు అక్కడ నమోదవుతున్న కేసుల సంఖ్యే చెబుతోంది. 2,081 పాజిటివ్ కేసులతో ఢిల్లీ, 1,298 పాజిటివ్ కేసులతో అహ్మదాబాద్, 915 పాజిటివ్ కేసులతో ఇండోర్, 660 కేసులతో పూణె, 537 కేసులతో జైపూర్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల్లోనే 60 శాతానికి పైగా కేసులు నమోదయ్యాయంటే ఆయా రాష్ట్రాల్లో కరోనావైరస్ ఏ స్థాయిలో విజృంభిస్తుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..