రాత్రికి రాత్రే జైలుగా మారిన దేశం: అమిత్ షా

కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఎమర్జెన్సీ(Emergency) మనస్తత్వం ఉందని, దాంతో ఆపార్టీలోని నాయకులే విసుగు చెందుతున్నారంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు.

Last Updated : Jun 25, 2020, 02:57 PM IST
రాత్రికి రాత్రే జైలుగా మారిన దేశం: అమిత్ షా

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని ఇందిరా గాంధీ (Indira Gandhi) 1975 జూన్ 25న విధించిన ఎమర్జెన్సీకి (emergency in India) నేటితో 45ఏళ్లు పూర్తవుతుంది. అప్పటి ‘జాతీయ అత్యవసర పరిస్థితి’ని గుర్తుచేస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) గురువారం కాంగ్రెస్ పార్టీ (congress party) పై విరుచుకుపడ్డారు. ఇప్పటికీ కాంగ్రెస్ మనస్తత్వం ఎమర్జెన్సీ సమయంలో ఉన్నట్లుగా ఉందన్నారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లతో కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తారు. భారత్‌లో ఆడేందుకు బీసీసీఐ హామీ ఇవ్వాలి: పాక్ జట్టు 

ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత, అధికార ప్రతినిధి సంజయ్ ఝా (Sanjay Jha)ను ఆపార్టీ తొలగించడం, మరికొన్ని సంఘటనలను షా ప్రస్తావించారు. ‘ఇటీవల జరిగిన సీడబ్ల్యూసీ (cwc) సమావేశంలో సీనియర్, యువ నాయకులు కొన్ని సమస్యలను లేవనత్తారు. కానీ పార్టీ అధినేతలు వారిపై అరిచేశారని, పార్టీ ప్రతినిధిని అనాలోచితంగా తొలగించారని, నిజమేమిటంటే కాంగ్రెస్‌లో నాయకులు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోలేకపోతున్నారని’ ట్వీట్ చేశారు.  నిరుద్యోగులకు శుభవార్త.. పరీక్ష లేకుండానే SBIలో జాబ్స్

‘భారతదేశ ప్రతిపక్ష పార్టీలలో ఒకటైన కాంగ్రెస్ తనను తాను ప్రశ్నించుకోవాలి. ఎమర్జెన్సీ మనస్తత్వం ఎందుకు ఉంది? ఓ వంశానికి చెందిన నేతలు తప్ప వేరే వారు ఎందుకు మాట్లాడటం లేదు? కాంగ్రెస్‌లో నాయకులు ఎందుకు విసుగు చెందుతున్నారు? ఇలా ఉంటే ప్రజలతో వారు మమేకం ఎప్పుడూ దూరంగానే ఉంటుందని’ మరో ట్వీట్‌లో అమిత్ షా పేర్కొన్నారు.  ఏపీలో ఒక్కరోజులో ఏకంగా 7 కరోనా మరణాలు

అత్యవసర పరిస్థితిని  గుర్తుచేస్తూ షా మరో ట్వీట్ చేశారు..  ‘45 ఏళ్ల క్రితం అధికారం కోసం ఇదే రోజున ఒక కుటుంబం దురాశ అత్యవసర పరిస్థితిని విధించడానికి దారితీసింది. రాత్రికి రాత్రే దేశం జైలుగా మారింది. పత్రికలు, కోర్టులు, స్వేచ్ఛా ప్రసంగాలు ఇలా అన్నింటిని అణగదొక్కారు. పేదలు, అణగారిన వారిపై అత్యాచారాలు జరిగాయని’ మరో ట్వీట్‌లో ప్రస్తావించారు. 

జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ

Trending News