విమాన ఇంధనంపై సుంకం తగ్గించిన మోదీ సర్కార్

కేంద్రం విమాన ఇంధనంపై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించి.. విమానయాన సంస్థలకు కాస్త ఊరటను ఇచ్చింది. జెట్‌ ఫ్యూయల్‌(ఏటీఎఫ్‌) పై విధిస్తున్న సుంకాన్ని 11% తగ్గిస్తున్నట్లు ఈ రోజే కేంద్రం ప్రకటించింది.

Updated: Oct 10, 2018, 11:54 PM IST
విమాన ఇంధనంపై సుంకం తగ్గించిన మోదీ సర్కార్
Image Credit: Pixabay

కేంద్రం విమాన ఇంధనంపై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించి.. విమానయాన సంస్థలకు కాస్త ఊరటను ఇచ్చింది. జెట్‌ ఫ్యూయల్‌(ఏటీఎఫ్‌) పై విధిస్తున్న సుంకాన్ని 11% తగ్గిస్తున్నట్లు ఈ రోజే కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం 14% వసూలు చేస్తున్న కేంద్రం 3% తగ్గించడంతో సంస్థలకు కాస్త ఉపశమనం లభించినట్లయింది. ఈ మధ్యకాలంలో ఇంధన ధరలు పెరుగుతున్న క్రమంలో తాము ఇబ్బంది పడుతున్నామని.. ప్రయాణికులపై కూడా అదనపు ఛార్జీలు వేయాల్సి వస్తుందని.. ఈ సమస్యకు పరిష్కారం నిమిత్తం సుంకం తగ్గించాలని సంస్థలు కేంద్రంతో మొర పెట్టుకోగా.. కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది.

విమాన యాన సంస్థల నుండి ప్రతిపాదనలను ఆహ్వానించి.. వాటిని పరిగణనలోకి తీసుకొని సుంకాన్ని తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2014లో ఇదే సుంకం 8% ఉండడం గమనార్హం. ప్రస్తుతం పెట్రోల్ ఛార్జీల పెంపుదలతో ప్రజలు ఇక్కట్లు పడుతున్న సందర్భంలో విమానయాన సంస్థలపై విధిస్తున్న సుంకాన్ని కేంద్రం తగ్గించడంతో మార్కెట్ వర్గాలు ఆశ్చర్యపోయాయి. 

ఈ మధ్యకాలంలో విమాన ఇంధనాన్ని దొంగలిస్తున్న ముఠాలు కూడా ఎక్కువగానే సంచరిస్తున్నాయి. ఇటీవలే ఢిల్లీకి దగ్గరలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వే ప్రాంతం నుండి  విమాన ఇంధనాన్ని దొంగిలించడానికి యత్నించిన 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నాలుగు టాంకర్స్‌, ట్రాక్టర్లు ద్వారా డ్రమ్ములలో ఇంధనాన్ని తరలిస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు.