కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. భారత దేశంలోనూ క్రమక్రమంగా పెరుగుతున్న కేసుల సంఖ్య ఆందోళనకు గురి చేస్తోంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా గణాంకాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం గడచిన 12 గంటల్లో ఏకంగా 131 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగాయి. దీంతో దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 1965కు చేరింది. అంటే దాదాపు 2 వేలకు చాలా దగ్గర్లో ఉందన్నమాట. వీటిలో 1764 పాజిటివ్ కేసులు కాగా.. ఇప్పటి వరకు 151 మంది చికిత్స తీసుకుని బయటపడ్డారు. దేశంలోని ప్రత్యేక ఐసోలేషన్ కేంద్రాల నుంచి వారు విడుదలయ్యారు. మరోవైపు భారత దేశంలో కరోనా వైరస్ మృతుల సంఖ్య 50కి చేరింది.
అటు కరోనా వైరస్ ను ధీటుగా ఎదుర్కునేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. కేవలం అత్యవసరాలు, నిత్యావసరాల కోసం మాత్రమే జనాన్ని బయటకు పంపిస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో జనం సామాజిక దూరం పాటిస్తున్నారు. మరోవైపు ప్రస్తుత తాజా పరిణామాలపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. భవిష్యత్ కార్యాచరణ, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..