Ganga Expressway: 'గంగా ఎక్స్‌ప్రెస్‌వే'కు ప్రధాని మోదీ శంకుస్థాపన..రూ.36,230 కోట్లతో నిర్మాణం..

Ganga Expressway: యూపీ​లోని షాజహాన్‌పూర్ జిల్లాలో 594 కిలోమీటర్ల గంగా ఎక్స్​ప్రెస్​వేకు శంకుస్థాపన చేశారు ప్రధాని నరేంద్ర మోదీ.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 18, 2021, 04:08 PM IST
  • 594 కిలోమీటర్ల గంగా ఎక్స్​ప్రెస్​వే
  • ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన
  • రూ.36,230 కోట్లతో నిర్మాణం
Ganga Expressway: 'గంగా ఎక్స్‌ప్రెస్‌వే'కు ప్రధాని మోదీ శంకుస్థాపన..రూ.36,230 కోట్లతో నిర్మాణం..

Ganga Expressway: ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని షాజహాన్‌పూర్ జిల్లా(Shahjahanpur District)లో 594 కిలోమీటర్ల గంగా ఎక్స్‌ప్రెస్‌వే(Ganga Expressway)కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) శంకుస్థాపన చేశారు. ఈ సిక్స్​లేన్​ ఎక్స్​ప్రెస్​వేను రూ.36,230 కోట్లతో నిర్మిస్తున్నారు. మీరట్‌లోని బిజౌలి గ్రామం దగ్గర ప్రారంభమయ్యే ఈ ఎక్స్‌ప్రెస్‌వే ప్రయాగ్‌రాజ్‌లోని జుడాపూర్ దండు గ్రామం వరకు ఉంటుంది. 

ఇది రాష్ట్రంలోని మీరట్, హాపూర్, బులంద్‌షహర్, అమ్రోహా, సంభాల్, బుదౌన్, షాజహాన్‌పూర్, హర్దోయ్, ఉన్నావ్, రాయ్ బరేలీ, ప్రతాప్‌గఢ్ మరియు ప్రయాగ్‌రాజ్ జిల్లాల గుండా వెళుతుంది. ఈ ఎక్స్​ప్రెస్​వే వద్దే 3.5 కిలోమీటర్ల ఎయిర్​ స్ట్రిప్​(air strip)ను కూడా నిర్మిస్తున్నారు. 2024 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తికానుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని నిర్మాణం పూర్తయితే..ఇది యూపీలోని అతి పొడవైన ఎక్స్‌ప్రెస్‌వేగా నిలుస్తోంది. ఇది రాష్ట్రంలోని పశ్చిమ మరియు తూర్పు ప్రాంతాలను కలుపుతుంది.

Also Read: DRDO Agni P: 'అగ్ని-పి' క్షిపణి ప్రయోగం విజయవంతం: డీఆర్​డీఓ

గంగా ఎక్స్​ప్రెస్​వే(Ganga Expressway) ద్వారా యువతకు ఉపాధి సహా ఎన్నో కొత్త అవకాశాలు కలుగుతాయని పేర్కొన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. త్వరలోనే అత్యాధునిక మౌలిక వసతులు కలిగిన రాష్ట్రంగా యూపీ నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News