130 కోట్ల భారతీయులకు వందనం..!!

భారత ప్రధానిగా నరేంద్ర మోదీ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ఏడాది పాలన పూర్తి చేసుకున్నారు. సరిగ్గా ఏడాది క్రితం మే 30న ప్రస్తుతం NDA ప్రభుత్వం అధికార  పగ్గాలు చేపట్టింది. నరేంద్ర మోదీ  రెండోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏడాది  పాలన పూర్తి కావడంతో.. ఈ  సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వం ముందున్న సవాళ్లకు  సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ.. దేశ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. 

Last Updated : May 30, 2020, 11:22 AM IST

గత ప్రభుత్వ కాలంలో సాధించిన విజయాలు, భారత దేశం ముందున్న సవాళ్లు, ప్రపంచ దేశాల్లో భారత స్థానం.. తదితర అంశాలతో 2019 ఎన్నికలకు వెళ్లిన భారతీయ జనతా పార్టీ.. అద్భుత విజయం సాధించింది. దీంతో NDA భాగస్వామ్య పార్టీల సాయంతో మళ్లీ రెండోసారి భారత ప్రభుత్వ పగ్గాలు చేపట్టింది. నేటితో సరిగ్గా ఏడాది పాలన  పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో ఈ ఏడాది కాలంలో గ్లోబల్ లీడర్ గా మలిచేందుకు ఎంతగానో శ్రమించామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

దేశ ప్రజలకు రాసిన బహిరంగ లేఖలో అనేక విషయాలు ఆయన వెల్లడించారు.  70 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370ని తొలగించామని పేర్కొన్నారు. వందల ఏళ్లుగా  పరిష్కారం కాని అయోధ్య  రామ మందిరం సమస్యను సామరస్యపూర్వకంగా  పరిష్కరించగలిగామన్నారు. అలాగే త్రిపుల్ తలాఖ్, పౌరసత్వ సవరణ చట్టాలను తీసుకొచ్చామని తెలిపారు. అంతేకాదు ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టామని తెలిపారు. పార్లమెంట్ సాక్షిగా ఎన్నో చట్టాలకు రూపకల్పన చేశామని లేఖలో పేర్కొన్నారు. 

దేశ ప్రజలు చూపించిన అప్యాయత, ఇచ్చిన సహకారం తనకు కొత్త శక్తి ఇస్తోందని ప్రధాని తెలిపారు. ఇందుకు 130 కోట్ల భారతీయులకు రుణపడి ఉంటానని తెలిపారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ ఆర్ధికంగా పెనువాళ్లు చుట్టుముడుతున్నాయని పేర్కొన్నారు. ఐతే దీన్ని భారత పౌరులు నిర్భరంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని సూచించారు. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ జాతీయ విపత్తుగా మారకూడదన్నారు. 

సబ్ కా సాథ్, సబ్  కా వికాస్, సబ్  కా విశ్వాస్ నినాదంలో ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని ప్రధాని నరేంద్ర మోదీ లేఖలో పేర్కొన్నారు. దేశ సమగ్రత అభివృద్ధి కోసం 130 కోట్ల మంది భారతీయులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News