ఆరెస్సెస్ కార్యక్రమానికి వెళ్లనున్న రాహుల్ గాంధీ?

ఆరెస్సెస్ కార్యక్రమానికి వెళ్లనున్న రాహుల్ గాంధీ?

Last Updated : Aug 27, 2018, 03:36 PM IST
ఆరెస్సెస్ కార్యక్రమానికి వెళ్లనున్న రాహుల్ గాంధీ?

అఖిల భారత కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని తమ సదస్సుకు ఆహ్వానించాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్‌) భావిస్తోంది. వచ్చే నెల ఢిల్లీలో జరిగే ఓ కార్యక్రమానికి ఆయన్ను పిలవాలని ఆరెస్సెస్‌ నేతలు భావిస్తున్నారు.  సెప్టెంబర్‌ నెలలో 17 నుంచి 19 వరకు ఆరెస్సెస్‌ నిర్వహించనున్న భారత భవిష్యత్తు సదస్సుకు రాహుల్‌ గాంధీతో సహా విపక్ష నేతలైన సీతారాం ఏచూరి వంటి వారిని ఆహ్వానించాలని భావిస్తున్నట్లు ఆరెస్సెస్‌ వర్గాలు తెలిపాయని జాతీయ నివేదికలు పేర్కొన్నాయి.

నివేదికల ప్రకారం.. ఈ కార్యక్రమంలో 'ది ఇండియా ఆఫ్ ది ఫ్యూచర్' అనే అంశంపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. న్యూఢిల్లీలో మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో వక్తలు ప్రసంగిస్తారు. 'భారత్ భవిష్యత్తు: ఆర్ఎస్ఎస్ దృష్టికోణం' అనే అంశంపై ఆరెస్సెస్‌ చీఫ్ మోహన్ భగవత్ ప్రసంగిస్తారు.

ఆరెస్సెస్ అంటేనే ఎక్కుపెట్టే రాహుల్.. ఆరెస్సెస్ నిర్వహించే సదస్సుకు వెళ్తారా? లేదా? అన్నది చూడాలి మరి. గతంలో భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నాగ్‌పూర్‌లో జరిగిన ఆరెస్సెస్ సదస్సుకు హాజరుకావడం.. ప్రసంగించడంపై విమర్శలు రావడం తెలిసిందే. కాంగ్రెస్ కూడా ప్రణబ్ హాజరుకావడంపై అప్‌సెట్ అయ్యింది.

ఇటీవలే రాహుల్ గాంధీ తన లండన్ పర్యటనలో.. అరబ్‌ దేశాల్లోని రాడికల్‌ ఇస్లామిస్టు గ్రూపు ముస్లిం బ్రదర్‌హుడ్‌తో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆరెస్సెస్‌)ను పోల్చారు.

Trending News