గవర్నర్ 'లైంగిక దుష్ప్రవర్తన'పై కేంద్రానికి పిర్యాదు

దక్షిణ భారతదేశంలో ఒక రాష్ట్ర గవర్నర్ "లైంగిక దుష్ప్రవర్తన" ఆరోపణలు ఎదుర్కొన్నారు.

Last Updated : Feb 26, 2018, 03:08 PM IST
గవర్నర్ 'లైంగిక దుష్ప్రవర్తన'పై కేంద్రానికి పిర్యాదు

దక్షిణ భారతదేశంలో ఒక రాష్ట్ర గవర్నర్ "లైంగిక దుష్ప్రవర్తన" ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీనిపై కేంద్ర హోంశాఖకు కూడా సోమవారం ఫిర్యాదు అందింది. రాజ్ భవన్ లో మహిళా ఉద్యోగులను గవర్నర్ తనకు సన్నిహితంగా ఉండాలని కోరుకుంటున్నట్టు ఆ ఫిర్యాదులో ఆరోపణలు ఉన్నాయి. లైంగిక దుష్ప్రవర్తన ఆరోపణలకు సంబంధించిన నివేదిక ఢిల్లీలో హోం మంత్రిత్వ శాఖకు చేరుకుంది.

అయితే దీనిపై కేంద్ర హోంశాఖ పెదవివిప్పలేదు. అయితే ఈ ఆరోపణలు ప్రస్తుతం గవర్నర్ గా ఉన్నప్పటి కాలానిదా?లేదా అంతకు ముందుకు సంబంధించినదా? వాస్తవం ఏంటో తేల్చాలని దర్యాప్తు సంస్థలకు నివేదించినట్టు ప్రభుత్వంలోని విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం ఆధారంగా ప్రముఖ జాతీయ పత్రిక ఓ కథనం ప్రచురించింది. దోషిగా తేలితే, గవర్నర్ ను రాజీనామా చేయాలంటూ కోరే అవకాశాలున్నాయని సమాచారం.

గవర్నర్ల మీద ఈ తరహా ఆరోపణలు కొత్తేమీ కాదు. 2017లో మేఘాలయ గవర్నర్ వి.షణ్ముగనాథన్ పై ఈ తరహాలోనే ఫిర్యాదులు వచ్చినప్పుడు రాజీనామా చేయవలసి వచ్చింది. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 100 మందికి పైగా రాజ్ భవన్ ఉద్యోగులను అడిగి రాజీనామా కోరారు.

Trending News