New Farm Laws: రైతు చట్టాలపై సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించిన అధ్యయన కమిటీ

New Farm Laws: వివాదాస్పద సాగుచట్టాలపై అధ్యయనం పూర్తయింది. నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది అధ్యయన కమిటీ. ప్రస్తుతం సాగుచట్టాలపై స్టే ఉన్నందున..తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకూ అమలు చేయవద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 1, 2021, 12:02 PM IST
  • కొత్త సాగుచట్టాలపై అధ్యయనం చేసి నివేదిక సుప్రీంకోర్టుకు సమర్పించిన కమిటీ
  • ఈ నెల 19న సీల్డ్ కవర్ నివేదికను కోర్టుకు సమర్పించినట్టు వెల్లడించిన కమిటీ సభ్యుడు పీకే మిశ్రా
  • మే నెలలో పార్లమెంట్ వరకూ పాదయాత్ర చేయాలని సంకల్పించిన రైతు సంఘాలు
New Farm Laws: రైతు చట్టాలపై సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించిన అధ్యయన కమిటీ

New Farm Laws: వివాదాస్పద సాగుచట్టాలపై అధ్యయనం పూర్తయింది. నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది అధ్యయన కమిటీ. ప్రస్తుతం సాగుచట్టాలపై స్టే ఉన్నందున..తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకూ అమలు చేయవద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది.

కేంద్ర ప్రభుత్వం(Central government) తీసుకొచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన ( Farmers protest) ఇంకా కొనసాగుతోంది. మరోవైపు సాగుచట్టలపై సుప్రీంకోర్టు తాత్కాలిక స్టే విధించింది. మరోవైపు సాగు చట్టాలపై అధ్యయనం కోసం కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యుడు పి కే మిశ్రా అధ్యయన నివేదికను మార్చ్ 19న సీల్డ్‌‌కవర్‌లో పెట్టి సుప్రీంకోర్టుకు సమర్పించారు. ఈ విషయాన్ని తాజాగా వెల్లడించారు. మూడు సాగు చట్టాల అమలుపై జనవరి 11 వ తేదీన సుప్రీంకోర్టు (Supreme court) స్టే ఇచ్చింది. కోర్టు తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకూ అమలు చేయవద్దని న్యాయస్థానం సూచించింది. నలుగురు సభ్యులతో కూడిన అధ్యయన కమిటీ చట్టాల్ని పూర్తిగా అధ్యయనం చేసి భాగస్వామ్యపక్షాలతో చర్చించి..రెండు నెలల్లోగా నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు అద్యయనం చేసి నివేదికను సమర్పించిన కమిటీ..కార్యాచరణను న్యాయస్థానమే నిర్ణయిస్తుందని తెలిపింది. సుప్రీంకోర్టు కమిటీ (Supreme court Committee) రైతు సంఘాలు నిపుణులు, వ్యాపార, వాణిజ్య సంఘాలు, మార్కెటింగ్ బోర్డులు వంటి భాగస్వామ్య పక్షాలతో 12 దఫాలు చర్చించి..అంతర్గతంగా సమావేశాలు నిర్వహించి నివేదిక రూపొందించింది. 

రైతుల ప్రయోజనాల్ని కాపాడటం కోసమే కొత్త సాగు చట్టాల్ని తీసుకొచ్చినట్టు కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ ( Union minister piyush goel) తెలిపారు. కొందరు వ్యక్తులు రైతుల్ని కావాలనే పక్కదోవ పట్టిస్తున్నారన్నారు. కొత్త చట్టాల గురించి రైతులు ఇప్పుడిప్పుడే అర్ధం చేసుకుంటున్నారని చెప్పారు. మండీ వ్యవస్థకు ఈ రైతు చట్టాల వల్ల ఎలాంటి నష్టం జరగదన్నారు. 

మరోవైపు కొత్త రైతు చట్టాలకు (New farm laws) వ్యతిరేకంగా ఆందోళనను మరింత ఉధృతం చేసేందుకు రైతుల సంఘాల ఐక్య వేదిక సంయుక్త కిసాన్ మోర్చా నిర్ణయించింది. రానున్న రెండు నెలల్లో చేపట్టాల్సిన కార్యాచరణను దాదాపుగా ఖరారు చేసింది. మే నెలలో పార్లమెంట్ వరకూ పాదయాత్ర ( Padayatra) కు సంకల్పించారు. శాంతియుతంగా చేపట్టనున్న ఈ యాత్రకు మహిళలు, నిరుద్యోగులు, కార్మికులు పాల్గొననున్నారు. జనవరి 26 తరహా ఘటనలు పునరావృతం కానివ్వమని చెప్పారు. 

Also read: Covid19 Virus: దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News