గతేడాది పాకిస్తాన్‌కి బుద్ది చెబుతూ భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ దాడులు ఎంత సంచలనం సృష్టించాయో తెలిసిందే. కేవలం, భారత్, పాకిస్తాన్ దేశాలకే కాకుండా యావత్ ప్రపంచం భారత్ వైపు చూసిన సందర్భం అది. భారత్-పాకిస్తాన్ మధ్య ఏం జరుగుతోందని ప్రపంచదేశాలు ఆసక్తిగా గమనించేలా చేసిన ఈ సర్జికల్ స్ట్రైక్స్ దాడులు ఐక్య రాజ్య సమితిలోనూ చర్చనియాంశమయ్యాయి. అయితే, భారత్ సాధించిన ఈ విజయాన్ని అంగీకరించడానికి పాకిస్తాన్ ముందుకు రాలేదు. భారత్ తమ దేశంలో సర్జికల్ స్ట్రైక్స్ దాడులు జరిపినట్టుగా చేసుకున్న ప్రకటన అవాస్తవం అని అప్పట్లో పాక్ ఖండించింది. ఏదేమైనా భారతీయులు అంతా గర్వించదగిన ఈ సర్జికల్ స్ట్రైక్స్ దాడులు జరిగి సెప్టెంబర్ 29తో ఏడాది పూర్తి కావస్తున్న సందర్భంగా తాజాగా ఈ దాడులకు సంబంధించిన వీడియోలను ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ తమ ట్విటర్ ఖాతా ద్వారా సోషల్ మీడియాలో పంచుకుంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ దాడుల వీడియో దృశ్యాలపై మీరూ ఓ లుక్కేయండి.
#WATCH: Visuals of Surgical strike footage of 29/9/2016 from Pakistan Occupied Kashmir (PoK) pic.twitter.com/5MyCeT7Gme
— ANI (@ANI) September 27, 2018
#WATCH: More visuals of Surgical strike footage of 29/9/2016 from Pakistan Occupied Kashmir (PoK) pic.twitter.com/GZSMH5Hct6
— ANI (@ANI) September 27, 2018
Visuals from surgical strike footage of 29/9/2016 from Pakistan Occupied Kashmir (PoK). pic.twitter.com/rA0FiKu7wS
— ANI (@ANI) September 27, 2018
వీడియో: సర్జికల్ స్ట్రైక్స్ దాడుల దృశ్యాలు