భారత్ లో విజృంభిస్తోన్న కరోనా..

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ మహమ్మారి తగ్గుముఖం పట్టకపోగా రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య అధికమవడంతో ఆందోళన మరింత తీవ్రమయ్యింది.  గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,561 కరోనా కేసులు నమోదుకాగా, 89 మరణాలు

Last Updated : May 7, 2020, 09:57 PM IST
భారత్ లో విజృంభిస్తోన్న కరోనా..

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ మహమ్మారి తగ్గుముఖం పట్టకపోగా రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య అధికమవడంతో ఆందోళన మరింత తీవ్రమయ్యింది.  గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,561 కరోనా కేసులు నమోదుకాగా, 89 మరణాలు సంభవించాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.

ప్రస్తుతం దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 52,952కి చేరిందని, మృతుల సంఖ్య మొత్తం 1,783కి చేరిందని పేర్కొన్నారు. కాగా ఇప్పటి వరకు కరోనా బారినుండి 15,266 మంది కోలుకోని డిశ్చార్జ్‌ కాగా, ప్రస్తుతం 35,902 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇదిలాఉండగా రాబోయే మరి కొన్ని రోజుల్లో కరోనా తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్ వైద్య నిపుణుడు రణదీప్ గులేరియా పేర్కొన్నారు.

మహారాష్ట్ర, గుజరాత్‌, ఢిల్లీలో కరోనా తీవ్రత రోజు రోజుకు పెరుగుతూ పోతోంది. దాదాపు 29 వేల కరోనా కేసులు ఈ మూడు చోట్లనే నమోదయ్యాయి. మహారాష్ట్రలో గురువారం సాయంత్రం నాటికి 16758 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 651 మంది మృత్యువాత పడ్డారు. గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో కరోనాతో 34 మంది మరణించారు. ఇక ఢిల్లీలో 5532, తమిళనాడులో 5000లకు పైగా, మధ్యప్రదేశ్‌లో 3138 కరోనా కేసులు నమోదయ్యాయి.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News