Uttarakhand: ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్‌కు తీవ్ర అస్వస్థత, ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలింపు

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతుండటంతో ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు.

Last Updated : Dec 28, 2020, 04:50 PM IST
Uttarakhand: ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్‌కు తీవ్ర అస్వస్థత, ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలింపు

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతుండటంతో ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు.

కరోనా వైరస్ ( Corona virus ) బారిన పడ్డ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ( Uttarakhand cm Trivendra singh rawat ) పరిస్థితి విషమిస్తోంది. ఒక్కసారిగా అస్వస్థతకు లోనవడంలో హుటాహుటిన ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈనెల 18న కరోనా వైరస్ నిర్ధారణ కావడంతో అప్పట్నించి స్వీయ నిర్భందంలో ఉన్నారు. అయితే ఆదివారం ఒక్కసారిగా తీవ్రమైన జ్వరం రావడంతో డెహ్రాడూన్,2లోని డూన్ దవాఖానలో చేరారు. స్కానింగ్ చేయగా..ఛాతీలో ఇన్‌ఫెక్షన్ చేరినట్టు వైద్యులు గుర్తించారు. అటు శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతుండటంతో వెంటనే ఢిల్లీ ఎయిమ్స్ ( Delhi Aiims ) ఆసుపత్రికి తరలించారు. అటు ముఖ్యమంత్రి సతీమణి, కుమార్తెలిద్దరికీ కరోనా వైరస్ సోకింది.

మరోవైపు ఈ నెల 15న యూకే ( UK ) నుంచి రాష్ట్రానికి తిరిగొచ్చిన ఐదుగురికి కరోనా వైరస్ నిర్ధారణైంది. వీరిలో ఒకరి ద్వారా ఇంకొందరికి కరోనా వైరస్ వ్యాపించిందని అధికారులు తెలిపారు. అందర్నీ ఐసోలేషన్‌కు తరలించారు. 

Also read: PM Narendra Modi: తొలి డ్రైవర్‌ రహిత మెట్రో రైలును ప్రారంభించిన ప్రధాని

Trending News