Social Media Ban: ఇండియాలో రేపట్నించి ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాలు ఆగిపోతాయా..కారణమేంటి

Social Media Ban: ప్రముఖ సోషల్ మీడియా వేదికలు ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లు ఇండియాలో నిలిచిపోనున్నాయా..కేంద్ర మంత్రిత్వ శాఖ ఏ ఆంక్షలు విధించింది..ఎందుకీ పరిస్థితి..అసలేం జరుగుతోంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 25, 2021, 08:07 PM IST
 Social Media Ban: ఇండియాలో రేపట్నించి ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాలు ఆగిపోతాయా..కారణమేంటి

Social Media Ban: ప్రముఖ సోషల్ మీడియా వేదికలు ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లు ఇండియాలో నిలిచిపోనున్నాయా..కేంద్ర మంత్రిత్వ శాఖ ఏ ఆంక్షలు విధించింది..ఎందుకీ పరిస్థితి..అసలేం జరుగుతోంది.

సోషల్ మీడియా (Social media)వేదికలైన ఫేస్‌బుక్(Facebook), ట్విట్టర్(Twitter), ఇన్‌స్టాగ్రామ్‌లకు(Instagram) ఇండియాలో గడ్డు పరిస్థితి ఎదురవుతోంది. 2021 ప్రారంభంలో అంటే ఫిబ్రవరి 25న ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కొత్త నియమావళి రూపొందించింది. ఇదే ఇప్పుడు ఈ సంస్థలకు ఇబ్బందిగా మారింది. కొత్త నియమావళి మే 26 నుంచి అమలు కానున్నాయి. కొత్త నిబంధనలు పాటించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మూడు నెలల గడువు కాస్తా ముగిసిపోవడానికి మరికొద్ది గంటలు మాత్రమే మిగిలింది.

ఈలోగా కేంద్ర ప్రభుత్వం(Central government) విధించిన నిబంధనల్ని అంగీకరించకపోతే వాటిపై వేటు తప్పదని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఐటీ నిబంధనల్లో (New IT Rules) అనేకాంశాలున్నాయి. ప్రతి సోషల్ మీడియా కంపెనీలకు ఇండియాలో సంబంధిత అధికారులుండాలి. వారి పేర్లు, ఇండియాలో వారి అడ్రస్, ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం, అభ్యంతరకరమైన కంటెంట్‌ను పర్యవేక్షించడం, సమ్మతి నివేదిక, అభ్యంతరకర కంటెంట్ తొలగింపు వంటివి ఈ నియమాల్లో ఉన్నాయి. ఇప్పటివరకూ ఏ సంస్థ కూడా ఈ నిబంధనల్ని అంగీకరించలేదు. అదే సమయంలో ఆరు నెలల సమయం కోరితే కేంద్రం అంగీకరించలేదు. అందుకే ఇప్పుడీ మూడు సంస్థలపై నిషేధం తప్పదా అనే చర్చ సాగుతోంది. మే 26వ తేదీ నుంచి ఈ మూడు సంస్థలు బ్లాక్‌లిస్ట్‌లోకి వెళ్తాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లేదా తాత్కాలికంగా ఈ సంస్థల సేవలు నిలిచిపోవచ్చనే ప్రచారం సాగుతోంది. 

Also read: Dearness Allowance: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులకు శుభవార్త, DA రెట్టింపు చేసిన సర్కార్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News