బ్లాక్ పెప్పర్ ఆరోగ్యానికే కాదు చర్మ, కేశ సంరక్షణకు సైతం చాలా మంచిది. వంట రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యంగా ఉంచుతాయి. కేశాల సంరక్షణకు నల్ల మిరియాలు చాలా బాగా పనిచేస్తాయి. బ్లాక్ పెప్పర్ సహజసిద్దమైంది కావడంతో ఏ విధమైన దుష్ప్రయోజనాల్లేవు. నల్లమిరియాలో డేండ్రఫ్ సమస్య కూడా దూరమౌతుంది.
నల్ల మిరియాలతో డేండ్రఫ్ సమస్యను చాలా సులభంగా దూరం చేయవచ్చు. బ్లాక్ పెప్పర్ ను పెరుగుతో కలిపి జుట్టుకు 30 నిమిషాలసేపు పట్టించాలి. ఆ తరువాత కేశాల్ని శుభ్రంగా కడగాలి. రోజూ క్రమం తప్పకుండా చేయడం వల్ల డేండ్రఫ్ సమస్య సులభంగా తగ్గుతుంది. బ్లాక్ పెప్పర్ బట్టతల ఇన్ ఫెక్షన్ కూడా దూరం చేస్తుంది.
నల్ల మిరియాలతో బట్టతల సమస్యకు పరిష్కారం
నల్ల మిరియాలతో బట్టతల సమస్య దూరం చేయవచ్చు. అంతేకాకుండా కేశాల ఎదుగుదలకు కూడా తోడ్పడుతుంది. ఈ సమస్య పరిష్కారం కోసం నల్ల మిరియాల్ని ఆలివ్ ఆయిల్ లో కలిపి రాయాలి. రోజూ క్రమం తప్పకుండా రాస్తే జుట్టు కొత్తగా వస్తుంది. క్రమ క్రమంగా బట్టతల సమస్య పోతుంది.
బ్లాక్ పెప్పర్ తో నిర్జీవమైన జుట్టు సమస్యను సులభంగా దూరం చేయవచ్చు. ఎందుకంటే ఇందులో పెద్దమొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ ఉంటాయి. కేశాల్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు కేశాల సమస్య కూడా పోతుంది. బట్టతల సమస్య నుంచి విముక్తి పొందేందుకు నల్ల మిరియాల్లో తేనె కలిపి రాయాలి. 15 నిమిషాల అనంతరం నీళ్లతో శుభ్రం చేయాలి.
Also read: Blood pressure: అధిక రక్తపోటును నియంత్రించే అద్భుతమైన చిట్కాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook