Ghee Benefits in Winter: చలికాలంలో ముఖం మరింత కోమలంగా, మృదువుగా ఉండాలంటే.. నెయ్యి వాడాల్సిందే!

Ghee Benefits for Skin in Winter: చలికాలంలో చర్మ సంబంధిత సమస్యలు ఎదురౌతుంటాయి. స్కిన్ డ్రైనెస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు కొన్ని హోమ్ రెమిడీస్ పాటించాలంటున్నారు బ్యూటిషియన్లు..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 28, 2022, 10:15 AM IST
Ghee Benefits in Winter: చలికాలంలో ముఖం మరింత కోమలంగా, మృదువుగా ఉండాలంటే.. నెయ్యి వాడాల్సిందే!

Ghee Benefits for Skin in Winter: చలికాలం మరో 4-5 రోజుల్లో ప్రారంభం కానుంది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే చలిగాలులు వీస్తున్నాయి. చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సంబంధిత సమస్యలు పీడిస్తుంటాయి. కొన్ని టిప్స్ పాటిస్తే ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చు.

చలికాలం ఆహ్లాదంగానే ఉంటుంది కానీ చర్మ సంబంధిత సమస్యలు బాధిస్తుంటాయి. చర్మ సంరక్షణ ఓ సమస్యగా మారుతుంది. చలికాలంలో చర్మం డ్రై అవుతుంటుంది. ముఖం నల్లగా మారిపోతుంది. చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసేందుకు మార్కెట్‌లో లభించే వివిధ లోషన్లు వినియోగిస్తుంటాం. ఈ లోషన్లు కూడా కాస్సేపటి వరకే పనిచేస్తాయి. అంతకుమించి సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. ఈ పరిస్థితుల్లో చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసేందుకు నెయ్యి అద్భుతంగా పనిచేస్తుంది.

నెయ్యి కచ్చితంగా ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాదు..చర్మానికి చాలా మేలు చేస్తుంది. రోజూ ముఖానికి నెయ్యి రాసుకుంటే..ముఖంపై ఉండే మచ్చలు, నల్లటి మరకలు, డార్క్ సర్కిల్స్ తొలగిపోతాయి. అటు చర్మానికి కావల్సిన పోషకాలు అందుతాయి.

నెయ్యిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఇన్‌ఫెక్షన్లు దూరమౌతాయి. నెయ్యిలో ఉండే పోషకాలతో స్కిన్ ఇన్‌ఫెక్షన్, స్వెల్లింగ్ దూరమౌతాయి. నెయ్యితో బాడీ మస్సాజ్ చేస్తే..దురద సమస్య పోతుంది.

నెయ్యి ముఖానికి , కళ్ల కింద అప్లై చేయడం వల్ల కంటి అలసట పోతుంది. రోజూ రాత్రి పూట నిద్రపోయే ముందు సర్కులర్ మోషన్‌లో కంటి చుట్టూ నెయ్యితో తేలిగ్గా మస్సాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల డార్క్ సర్కిల్స్ తొలగిపోవడమే కాకుండా..కంటి అలసట దూరమౌతుంది.

నెయ్యి రాయడం వల్ల చర్మానికి నిగారింపు, మృదుత్వం వస్తాయి. దీనికోసం రోజూ రాత్రి పూట పడుకునేముందు ముఖంపై నెయ్యి రాసి నెమ్మదిగా మస్సాజ్ చేయాలి. దీనివల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. వృద్దాప్య లక్షణాలు క్రమంగా తగ్గుతాయి.

మీ పెదాలు పగులుతుంటే..నెయ్యి అద్భుతంగా పనిచేస్తుంది. పెదాలపై నెయ్యి రాయడం వల్ల పెదాలు పగిలే సమస్య దూరమౌతుంది. పెదవులు డ్రై కాకుండా మృదువుగా ఉండేట్టు చేస్తుంది.

Also read:Jaggery For Blood Pressure: ఈ రెండు తీవ్ర వ్యాధులకు బెల్లంతో కేవలం 15 రోజుల్లో చెక్‌ పెట్టండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News