Oil Free Kichdi : ఆయిల్ ఫ్రీ కిచిడీ.. త‌యారు చేసుకోండి ఇలా..!

Oil Free Kichdi recipe: పెస‌ర‌ప‌ప్పు, బియ్యం క‌లిపి చేసే ఈ కిచిడీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని  పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా  తింటారు. లంచ్ బాక్స్ లోకి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 2, 2024, 09:57 PM IST
Oil Free Kichdi : ఆయిల్ ఫ్రీ కిచిడీ.. త‌యారు చేసుకోండి ఇలా..!

Oil Free Kichdi Recipe: ఖిచ్డీ అన్నం మరియు మూంగ్ పప్పుతో చేసిన ఆరోగ్యకరమైన భారతీయ వంటకం. నెయ్యి , జీలకర్ర గింజలు, అల్లం, ఇంగువ వంటి ఇతర పదార్థాలు ఉపయోగించబడతాయి. ఈ వంటకం పిల్లలు ఎంతో మేలు , అనారోగ్యం నుంచి కోలుకుంటున్న వ్యక్తులకు మంచి ఆహారం. కాబట్టి చాలా మంది దీనిని రోగులకు ఆహారంగా తీసుకుంటారు.

ఆయిల్ ఫ్రీ కిచిడీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు:

ఒక గ్లాస్ - బియ్యం 

అర‌గ్లాస్ - పెస‌ర‌ప‌ప్పు

అర టీ స్పూన్ -  జీల‌క‌ర్ర 

ఒక చిన్న ముక్క‌ -  దాల్చిన చెక్క

మూడు - లవంగాలు

మూడు - యాల‌కులు

బిర్యానీ ఆకు

స్టోన్ ప్ల‌వ‌ర్ 

మిరియాలు 

అనాస పువ్వు

పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయ

త‌రిగిన ప‌చ్చిమిర్చి  

అల్లం వెల్లుల్లి పేస్ట్ 

త‌రిగిన బంగాళాదుంప 

త‌రిగిన బీన్స్ 

త‌రిగిన క్యారెట్ 

జీడిప‌ప్పు 

ఎండుకొబ్బ‌రి పొడి 

ఉప్పు 

ప‌సుపు 

నీళ్లు మూడు గ్లాసులు

త‌రిగిన కొత్తిమీర 

త‌రిగిన పుదీనా 

ఆయిల్ ఫ్రీ కిచిడీ త‌యారీ విధానం:

ముందుగా ఒక గిన్నెలో బియ్యాన్ని, పప్పును శుభ్రంగా నానబెట్టుకోవాలి. కుక్కర్‌లో జీలకర్ర, ఉల్లిపాయ,  మాసాలా దినుసులు  కొద్దిగా నీళ్లు పోసి వేయించాలి. 
ఉల్లిపాయ ముక్క‌లు మ‌గ్గిన త‌రువాత ప‌చ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కూర‌గాయ ముక్క‌లు, జీడిప‌ప్పు వేసి వేయించాలి. 

ముక్క‌లు మ‌గినాక ఎండుకొబ్బ‌రి పొడి వేసి మ‌రో రెండు నిమిషాల పాటు వేయించాలి. నాన‌బెట్టుకున్న బియ్యం, పెస‌ర‌పప్పు వేసి వేయించాలి. బియ్యంలోని నీరంతా పోయే వ‌ర‌కు బాగా వేయించాలి. ఇందులోకి ఉప్పు, ప‌సుపు వేసి క‌ల‌పాలి. 

త‌రువాత కొత్తిమీర‌, పుదీనా వేసి మూత పెట్టి పెద్ద మంట‌పై 2 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్క‌ర్ ఆవిరి పోయిన త‌రువాత మూత తీసి  క‌లుపుకుని స‌ర్వ్ చేసుకోవాలి.  ఈ విధంగా త‌యారు చేసిన కిచిడీని తీసుకోవ‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు.  ఈ విధంగా మీరు కూడా  ఈ కిచిడీని ట్రై చేసి తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.

Also Read Tomato Juice Benefits: అజీర్ణం సమస్యతో బాధపడుతున్నవారు.. ఈ జ్యూస్‌ తాగుతే సమస్యకు చెక్‌!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News