Heavy Rains Alert: మొన్నటి వరకూ మండిన ఎండలతో వేడెక్కిన వాతావరణం భారీ వర్షాలతో ఒక్కసారిగా చల్లబడింది. ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.
మే నెల ప్రారంభమవుతూనే వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. మొన్నటి వరకూ భగభగమండిన ఎండల్నించి కాస్త ఉపశమనం లభించినా..అకాల వర్షాలు కావడంతో రైతన్నలకు కష్టాలెదురవుతున్నాయి. అకాల వర్షాలు, ఉరుములు, మెరుపులతో పంట నాశనమౌతోంది. ఇప్పటికే వాతావరణ శాఖ ఆరెంజ్ ఎలర్ట్ జారీ చేసింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో నిన్న రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీవర్షం నమోదైంది. నిన్న రాత్రి 9 గంటల్నించి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. మరోవైపు పండిన పంటలు తడిసి నాశనమయ్యాయి.
ఈదురుగాలులు, భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రోడ్లపై మోకాలు లోతు నీరు చేరడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులెదురయ్యాయి. మెరుపువర్షం కారణంగా చాలా ప్రాంతాల్లో అలర్ట్ ప్రకటితమైంది. ఏపీలో ఇవాళ, రేపు పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. విదర్భ నుంచి ఉత్తర తమిళనాడు వరకూ తెలంగాణ, కర్ణాటక మీదుగా ద్రోణి కొనసాగనుందని ఐఎండీ తెలిపింది. ఫలితంగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో మరో రెండ్రోజులు భారీ వర్షాలు తప్పవని ఐఎండీ హెచ్చరించింది.
ఇవాళ ఎన్టీఆర్ జిల్లా, కోనసీమ, ఏలూరు, కృష్ణా, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. ఇక వైఎస్సార్ కడప, సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి.
మరోవైపు ఏపీలో ఇవాళ ఉదయం 5 గంటల్నించి భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. ఎడతెరిపిలేకుండా 2-3 గంటలుగా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చేతికందాల్సిన పంట నీట మునిగి నాశనమైంది. అకాల వర్షాలతో రైతన్నలు గగ్గోలు పెడుతున్నారు.
Also read: Chandrababu naidu and Pawan kalyan meeting: చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ భేటీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook