Raj Yoga Astrology: 100 సంవత్సరాల తర్వాత కేంద్ర త్రికోణ రాజయోగం, ఈ రాశులవారు తరగని సంపద పొందడం ఖాయం

Kendra Trikona Raj Yoga Benefits: కొన్ని గ్రహాలు ఒకే రాశిలో కలవడం కారణంగా కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది. దీని కారణంగా చాలా రాశులవారి జీవితాల్లో మార్పులు ఏర్పడతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 21, 2023, 09:58 AM IST
Raj Yoga Astrology: 100 సంవత్సరాల తర్వాత కేంద్ర త్రికోణ రాజయోగం, ఈ రాశులవారు తరగని సంపద పొందడం ఖాయం

Kendra Trikona Raj Yoga Benefits: జ్యోతిష్య శాస్త్రంలో ఏర్పడే రాజయోగాలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన గ్రహాలు శుభ స్థానాల్లో సంచారం చేసినప్పుడు రాజయోగాలు ఏర్పడుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ యోగాలు కొన్ని రాశులవారికి అదృష్టాన్ని కలిగిస్తే మరికొన్ని రాశులవారి జీవితాల్లో తీవ్ర దుష్ప్రభావాలు కలిగించే అవకాశాలు కూడా ఉన్నాయట. అయితే కుజుడు సింహ రాశిలోకి సంచారం చేశాడు. ఇదే క్రమంలో శుక్రుడు కూడా అదే రాశిలో ఉండడం వల్ల అతి శక్తివంతమైన కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడింది. ఈ రెండు గ్రహాలు దాదాపు 100 సంవత్సరాల తర్వాత కలిశాయి. అయితే ఈ రాజయోగం సంచారం అన్ని రాశులవారిపై క్రమంగా పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ ప్రత్యేక యోగ ప్రభావం ఏయే రాశివారిపై పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రాశులవారిపై ప్రభావం:
మేష రాశి:

మేష రాశిపై కూడా కేంద్ర త్రికోణ రాజయోగం ప్రత్యేక ప్రభావం పడబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రభావం వల్ల చాలా రకాల ప్రయోజనాలు పొందబోతున్నారు. ఉద్యోగాలు చేసేవారు హార్డ్‌ వర్క్‌ చేయడం వల్ల కంపెనీలో ప్రమోషన్స్‌ పొందే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా నష్టపోయిన వారు ఈ క్రమంలో లాభాలు పొందే ఛాన్స్‌ ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేవారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. ఒక్కసారి పెట్టుబడి పెడితే రెట్టింపు ప్రయోజనాల పొందే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు ఈ క్రమంలో విజయాలు సాధిస్తారు. దంపతుల మధ్య ప్రేమ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 

Also Read: Heavy Rains: ఎడతెరిపి లేని భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు

సింహ రాశి:
సింహ రాశి వారికి ఉద్యోగాలు మారడానికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. త్రికోణ రాజయోగం కారణంగా వీరు స్థానచలనం చేయడం వల్ల రెట్టింపు జీతంతో ఉద్యోగాలు లభించే ఛాన్స్‌ కూడా ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఎంతకాలం నుంచో పెడింగ్‌లో ఉన్న పనులు ఈ క్రమంలో సులభంగా తీరుతాయి. ఇక వ్యాపారాలు చేవారికి ఇది ప్రత్యేక సమయంగా భావించవచ్చు. ఏ వ్యాపారంలో పెట్టుబడి పెట్టిన అనుకున్న లాభాలు పొందవచ్చు. ముఖ్యంగా కష్టపడి పనులు చేసేవారికి భారీ లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ రాశివారు కుటుంబంతో సంతోషంగా, ఆనందంగా గడిపే అవకాశాలు కూడా ఉన్నాయి. 

ధనుస్సు రాశి:
కేంద్ర త్రికోణ రాజయోగం ప్రభావం ధనస్సు రాశివారిపై కూడా పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా ఈ రాశివారు ఊహించని లాభాలు పొందుతారు. వ్యాపారాలు పెట్టుబడులు పెడితే భారీ లాభాలు పొందుతారు. అంతేకాకుండా కొత్త వ్యాపారాలు ప్రారంభించే ఛాస్స్‌ కూడా ఉంది. కష్టపడి పనులు చేసేవారు మంచి ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్‌ కూడా లభిస్తాయి. ఈ రాజయోగం కారణంగా భవిష్యత్‌లో మంచి ప్రయోజనాలు పొందుతారు.

Also Read: Heavy Rains: ఎడతెరిపి లేని భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

Trending News