పెళ్లి చేసుకున్నాక భార్య.. భర్తతో ఉండాలనేది లేదని సుప్రీం కోర్టు తెలిపింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త వద్ద కాకుండా.. తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోవాలని 23 ఏళ్ల జైన్ మహిళ అభ్యర్థనకు సుప్రీంకోర్టు ఆమోదించింది. సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలో రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది.
అంతకుముందు ఆ మహిళతో ముఖాముఖి మాట్లాడేందుకు ఢిల్లీకి తీసుకురావలసిందిగా కోర్టు ఛత్తీస్‌గఢ్ పోలీసులను ఆదేశించగా.. సోమవారం ఆమెతో న్యాయమూర్తులు సమావేశమయ్యారు. గతంలో తాను ముస్లిం వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు.. తనకోసం హిందూమతంలోకి మారి పేరు మార్చుకున్నట్లు ఆమె చెప్పింది. భర్త వద్ద ఉండాలనుకోవడం లేదని.. తన ఇష్టప్రకారమే తల్లిదండ్రుల వద్దకు తిరిగి వెళ్లిపోవాలని అనుకుంటున్నట్లు ఆ మహిళ చెప్పగా.. ధర్మాసనం ఆమె మనోభీష్టానికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపింది. మహిళకు నిర్ణయం తీసుకొనే అధికారం ఉందని, ఒకవేళ మహిళ భర్తతో కలిసి ఉండకపోతే అది మ్యాట్రిమోనియల్ కేసవుతుందని తెలిపింది.
భర్తతోనే భార్య ఉండాలని లేదు: సుప్రీంకోర్టు