/telugu/photo-gallery/puri-jagannadh-explains-about-emotional-blockmail-in-puri-musings-pa-180794 Puri Jagannadh: వాళ్లు అమాయకులుగా కన్పించే క్రిమినల్స్..  షాకింగ్ కామెంట్స్ చేసిన పూరీ జగన్నాథ్.. స్టోరీ ఏంటంటే..? Puri Jagannadh: వాళ్లు అమాయకులుగా కన్పించే క్రిమినల్స్.. షాకింగ్ కామెంట్స్ చేసిన పూరీ జగన్నాథ్.. స్టోరీ ఏంటంటే..? 180794

EPFO Balance Check in Telugu: ఇటీవల ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌) వడ్డీ రేటును 2022-23 ఆర్థిక సంవత్సరానికి  8.15 శాతంగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈపీఎఫ్‌ ఖాతాలో వడ్డీని నెలవారీ ప్రాతిపదికన లెక్కించినా.. ఆర్థిక సంవత్సరం చివరిలో డిపాజిట్లు చేస్తుంది ఈపీఎఫ్‌ఓ. ఈ నేపథ్యంలోనే 2022-23 ఆర్థిక సంవత్సరంలో వడ్డీ సొమ్ము ఎప్పుడు జమ అవుతుందని పీఎఫ్‌ ఖాతాదారులు ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ విషయంపై ఈపీఎఫ్‌ఓ అప్‌డేట్ ఇచ్చింది. తమ అధికారిక ట్విట్టర్‌లో వివరాలను షేర్ చేసుకుంది. చాలా మంది ఖాతాదారులు FY 2022 కోసం వడ్డీ రేటు డబ్బును అందుకున్నారని తెలిపింది. మరి కొంతమందికి వారి ఖాతాల్లో డబ్బు జమ అవ్వడానికి కొంత సమయం వెల్లడించింది. 

ప్రతి నెల ఉద్యోగి ఖాతాలో నుంచి 12 శాతం ఈపీఎఫ్‌ ఖాతాకు జమ అవుతుంది. ఇందుకు కంపెనీ కూడా 12 శాతం జమ చేస్తుంది. ఇందులో  3.67 శాతాన్ని ఈపీఎఫ్ ఖాతాలో జమ అవుతుండగా.. మిగిలిన 8.33 శాతం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్‌)లో డిపాజిట్ అవుతుంది. "వడ్డీ డిపాజిట్ ప్రాసెస్ జరుగుతోంది. ఇప్పటికే కొందరి ఖాతాల్లో జమ అయింది. అతి త్వరలో మిగిలిన వారికి కూడా జమ అవుతుంది. వడ్డీ జమ అయినప్పుడల్లా.. మొత్తంపై లెక్కించి జమ అవుతుంది. ఎలాంలి వడ్డీ నష్టం ఉండదు. దయచేసి ఓపిక పట్టండి." అని ఈపీఎఫ్‌ఓ వెల్లడించింది. వడ్డీ కోసం ఈపీఎఫ్‌ సభ్యులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో ట్విట్టర్‌లో సమాధానం ఇచ్చింది. గత మూడేళ్ల వడ్డీ బకాయిలు త్వరలో చందాదారుల ఖాతాలో జమ అవుతాయని తెలిపింది.

 

ఈపీఎఫ్‌ బ్యాలెన్స్‌ను ఎలా చెక్ చేసుకోవాలి..?

==> ఉమాంగ్ యాప్‌ను ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి.
==> మీ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
==> ఈపీఎఫ్‌ ఆప్షన్‌పై ఎంటర్ చేయండి. 
==> ఆ తరువాత View Passbookపై క్లిక్ చేయండి.
==> మీ యూఏఎన్ ఎంటర్ చేసి.. గెట్ OTPపై క్లిక్ చేయండి.
==> మీ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి.. లాగిన్ అవ్వండి.
==> అనంతరం ఈపీఎఫ్‌ పాస్‌బుక్, బ్యాలెన్స్ సమాచారం స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతాయి 

ఈపీఎఫ్‌ఓ పోర్టల్ ద్వారా పీఎఫ్‌ బ్యాలెన్స్‌కు చెక్ చేసుకోవచ్చు. ఈపీఎఫ్‌ఓ ​​అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ అయిన తరువాత మెంబర్ పాస్‌బుక్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. యూఏఎన్, పాస్‌వర్డ్‌ను మరోసారి ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. మీ పీఎఫ్‌ పాస్ బుక్ వివరాలు స్క్రీన్‌పై ప్రత్యక్షం అవుతాయి. 

 

Section: 
English Title: 
EPFO Interest Update when will credit epf interest for 2022-23 how to check EPF account balance Check here Full Details
News Source: 
Home Title: 

EPFO Interest Update: ఈపీఎఫ్‌ వడ్డీ కోసం ఎదురుచూస్తున్నారా..? క్లారిటీ ఇదిగో..! బ్యాలెన్స్ ఇలా చెక్ చేసుకోండి
 

EPFO Interest Update: ఈపీఎఫ్‌ వడ్డీ కోసం ఎదురుచూస్తున్నారా..? క్లారిటీ ఇదిగో..! బ్యాలెన్స్ ఇలా చెక్ చేసుకోండి
Caption: 
Epfo (Source: File Photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
ఈపీఎఫ్‌ వడ్డీ కోసం ఎదురుచూస్తున్నారా? క్లారిటీ ఇదిగో! బ్యాలెన్స్ ఇలా చెక్ చేసుకోండి
Ashok Krindinti
Publish Later: 
No
Publish At: 
Sunday, August 6, 2023 - 11:35
Created By: 
Krindinti Ashok
Updated By: 
Krindinti Ashok
Published By: 
Krindinti Ashok
Request Count: 
51
Is Breaking News: 
No
Word Count: 
288