Side Effects Of Eating Too Much Salt: ఉప్పులేని ఆహారాలు తినడం చాలా కష్టం..ఆహారాల రుచి నోటికి అందడానికి ఉప్పను వినియోగిస్తూ ఉంటారు. అయితే చాలా మంది ప్రస్తుతం ఆహారాలను అతిగా తీసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల చాలా హానికరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజు అతిగా ఉప్పు కలిగిన ఆహారాలు తినడం వల్ల అధిక రక్తపోటుతో పాటు తీవ్ర జీర్ణక్రియ సమస్యలు రావచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఉప్పను ఎక్కువగా తినడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గే ఛాన్స్ కూడా ఉంది. ఇవే కాకుండా ఇతర అనారోగ్య సమస్యల కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఉప్పును అతిగా తినడం వల్ల శరీరానికి కలిగే దుష్ప్రభావాలు:
రక్తపోటు:
ఆహారంలో ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యల వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అతిగా ఉప్పు తినేవారిలో సులభంగా రక్తపోటు వంటి సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి ఉప్పును అతిగా తీసుకోకపోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
గుండె వ్యాధులకు దారీ తియోచ్చు:
ఉప్పును అతిగా తీసుకోవడం వల్ల తీవ్ర గుండె సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రోజుకు ఐదు గ్రాముల కంటే ఎక్కువ ఉప్పును తీసుకోవడం వల్ల పక్షవాతం వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు గుండెపోటు, స్ట్రోక్, కరోనరీ హార్ట్ ఎటాక్ వంటి సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి ఆహారాల్లో ఉప్పును అతిగా తీసుకోకపోవడం మంచిది.
Also Read: CM KCR: సీఎం కేసీఆర్ రాఖీ పండుగ గిఫ్ట్.. వారి జీతాలు పెంచుతూ నిర్ణయం
డీహైడ్రేషన్:
ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ సమస్యలు కూడా వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి. దీని కారణంగా నిర్జలీకరణ సమస్యకు కూడా దారీ తీయోచ్చు. కాబట్టి ఉప్పును సరైన పరిమాణాల్లోనే వినియోగించాల్సి ఉంటుంది.
కిడ్నీ సమస్యలు:
అధికంగా ఉప్పు తీసుకోవడం కిడ్నీలు దెబ్బతినడమే కాకుండా కొందరిలో కిడ్నీలు ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు కొందరిలో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.
Also Read: CM KCR: సీఎం కేసీఆర్ రాఖీ పండుగ గిఫ్ట్.. వారి జీతాలు పెంచుతూ నిర్ణయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook