Judges Trolling Case: న్యాయమూర్తిని దూషించిన టీడీపీ నేత అరెస్ట్, ఇవాళ కోర్టులో హాజరుపర్చే అవకాశం

Judges Trolling Case: ఏపీ స్కిల్ కుంభకోణంలో చంద్రబాబు అరెస్ట్ తరువాత సోషల్ మీడియాలో ఓ వర్గం రెచ్చిపోయింది. న్యాయమూర్తుల్ని దూషిస్తూ పోస్టులు పెట్టసాగింది. ఈ వ్యవహారంపై ఆగ్రహం చెందిన ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 28, 2023, 10:40 AM IST
Judges Trolling Case: న్యాయమూర్తిని దూషించిన టీడీపీ నేత అరెస్ట్, ఇవాళ కోర్టులో హాజరుపర్చే అవకాశం

Judges Trolling Case: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయినప్పటి నుంచి సోషల్ మీడియా సాక్షిగా కొంతమంది టీడీపీ నేతలు, కార్యకర్తలు న్యాయమూర్తులపై ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమబిందును ఇదే విధంగా అవమానించిన టీడీపీ నేతను పోలీసులు అరెస్ట్ చేశారు. 

స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్టు తరువాత ఏసీబీ కోర్టు న్యాయమూర్తి, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ పెరిగిపోయింది. న్యాయమూర్తులపై అనుచిత పోస్టులు, ట్రోలింగ్ వ్యవహారాన్ని ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఎందుకంటే రాష్ట్రపతి భవన్ సైతం ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ ఛీఫ్ సెక్రటరీకు ఆదేశాలు జారీ చేసింది. దాంతో ప్రభుత్వం క్రిమినల్ కంటెంప్ట్ పిటీషన్ వేసింది. ఈ పిటీషన్‌పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, గోరంట్ల బుచ్చయ్య చౌదరి సహా 26 మందికి నోటీసులు జారీ చేసింది. 

మరోవైపు ఈ కేసులో ఎవరెవరు ఏసీబీ న్యాయమూర్తి హిమబిందును టార్గెట్ చేసి అనుచిత పోస్టులు పెట్టారో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అలాంటి ఓ వ్యక్తికి పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తి టీడీపీ సోషల్ మీడియా రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ముల్లా ఖాజా హుస్సేన్‌గా పోలీసులు ధృవీకరించారు. ఓ ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్న ఈ వ్యక్తిని పోలీసులు నంద్యాలలో అరెస్టు చేశారు. ఇవాళ కోర్టులో హాజరుపర్చనున్నారు. టీడీపీ సోషల్ మీడియా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ హోదాలోనే పోస్టులు పెట్టినట్టు ముల్లా ఖాజా హుస్సేన్ అంగీకరించారు. 

Also read: Gujarat High Court: బెయిల్ వచ్చినా మూడేళ్లుగా జైళ్లోనే, గుజరాత్ హైకోర్టు ఆగ్రహం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News