ICC world cup 2023: ప్రపంచ వరల్డ్ కప్ 2023 మెగా టోర్నీ ప్రారంభమైన సంగతి తెలిసిందే! అక్టోబర్ 5 న భారత్ లో ప్రారంభమైంది. మొదటి మ్యాచ్ ఇంగ్లాండ్ మరియు న్యూజిలాండ్ మధ్య జరిగింది. ఆదివారం అక్టోబర్ 8 వ తేదీన భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. ఈ రోజు మధ్యాన్నం ఆఫ్ఘనిస్తాన్ తో భారత్ తలపడుతుంది. అయితే శనివారం 14 వ తేదీన.. దాయాదిదేశం పాకిస్థాన్ తో భారత్ తలపడనుంది. భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలు ప్రేక్షకులు టీవీ లకి అతుక్కుపోతుంటారు.
కాకపోతే విషయం ఏంటంటే.. భారత్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ‘డెంగ్యూ’ బారినపడిన కారణంగా మొదటి రెండు మ్యాచ్ లు ఆడలేకపోయిన సంగతి తెల్సిందే! పాకిస్తాన్ తో జరగనున్న మ్యాచ్ లో అయినా గిల్ ఆడతాడా లేదా అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతుంది.
చెన్నైలోని ప్రముఖ ఆసుపత్రిలో బీసీసీఐ గిల్ ను చేర్పించింది. తరువాత మంగళవారం డిశ్చార్జ్ చేశారు. డెంగ్యూ కారణంగా ఈ రోజు జరుగునున్న అఫ్గాన్ మ్యాచ్ కు దూరం అవ్వనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. పాకిస్థాన్ తో తలపడనున్న మ్యాచ్ లో గిల్ ఆడతాడా లేడా అన్న సందేహం పై టీమిండియా కోచ్ విక్రమ్ రాఠోడ్ స్పందించాడు.
Also Read: IND Vs AFG World Cup 2023: ఆఫ్ఘనిస్థాన్‌దే బ్యాటింగ్.. టీమిండియాలో అనూహ్య మార్పు.. ఆ బౌలర్ ఔట్
మ్యాచ్ ముందు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న బ్యాటింగ్ కోచ్ విక్రమ్ మాట్లాడుతూ.. "గిల్ డెంగ్యూకి గురైన మాట వాస్తవమే మరియు ఆసుపత్రిలో చేర్చిన మాట కూడా వాస్తవమే.. ముందస్తు చర్యగా ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించాము.. గిల్ త్వరగా కోలుకుంటున్నాడు.. ఇప్పటికి 70 నుండి 80 శాతం వరకు కోలుకున్నాడు. బాగానే ఉన్నప్పటికీ.. వరల్డ్ కప్ మ్యాచ్ లలో ఏ మ్యాచ్ కి జట్టులో ఆడతాడో అనే విషయం ఇప్పటికి అయితే చెప్పలేము అని తెలిపారు.
"భారత్ బ్యాటింగ్ ఆర్డర్ ఒక్కరిపైనే ఆధారపడి లేదు.. శుభ్‌మన్ గిల్ అందుబాటులో లేకపోయినా భారత్ బ్యటింగ్ లైనప్ చాలా బలంగా ఉంది. అంతేకాకుండా గిల్ కి ప్రత్యమ్నాయం కూడా జట్టులోని ఉంది. గిల్ స్థానాల్లో ఇషాన్ కిషన్ బరిలోకి దిగనున్నాడు. ఫామ్ లో ఉన్న ఆటగాళ్లతో పాటు, అనుభవం కలిగిన ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. జట్టులో ఉన్న ప్రతి ఒక్కరికి వారి వారి పాత్రలు ఏంటో తెలుసు" అని టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ తెలిపారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శుభమన్ గిల్ కోలుకొని శనివారం 14 వ తేదిన పాకిస్థాన్ తో జరగబోయే మ్యాచ్ కి అందుబాటులో ఉండటం కష్టమే అని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
Also Read: PM Kisan Status: రైతులకు శుభవార్త.. రూ.8 వేలకు పెంచనున్న కేంద్రం.. ఇలా అప్లై చేసుకోండి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి