Ap Elections Survey: ఇప్పుడే ఎన్నికలు జరిగితే ఏపీలో అధికారం ఎవరిది, హల్‌చల్ చేస్తున్న పోల్ స్కాన్ సర్వే

Ap Elections Survey: తెలంగాణలో ఎన్నికలు ముగిశాయి. అధికార బీఆర్ఎస్ పార్టీని ఓడించిన తెలంగాణ ఓటరు కాంగ్రెస్ పార్టీకు పట్టం కట్టాడు. ఇప్పుడిక అందరి దృష్టి ఏపీపై పడింది. తెలంగాణ ఫలితాలు ఏపీపై ఉంటాయనేది కొందరు అంచనా వేస్తున్న తరుణంలో ఓ సర్వే హల్‌చల్ చేస్తోంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 7, 2023, 08:55 AM IST
Ap Elections Survey: ఇప్పుడే ఎన్నికలు జరిగితే ఏపీలో అధికారం ఎవరిది, హల్‌చల్ చేస్తున్న పోల్ స్కాన్ సర్వే

Ap Elections Survey: పదేళ్ల తరువాత ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ తెలంగాణలో అధికారం కోల్పోయింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతోంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మరి కాస్సేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణ ఫలితాలు సహజంగానే ఏపీలో త్వరలో జరిగే ఎన్నికలపై ప్రభావం చూపనున్నాయనే చర్చ ప్రారంభమైంది. అందరి దృష్టి ఇప్పుడు ఏపీపై పడింది. 

ఏపీలో మరో నాలుగు నెలల్లో అటు అసెంబ్లీ ఇటు లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో అందరూ ఏపీ గురించి చర్చ ప్రారంభించారు. తెలంగాణ పరిస్థితిని ఏపీతో పోలుస్తూ వ్యాఖ్యానాలు చేస్తున్నారు. 2019లో 151 సీట్లతో భారీ విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈసారి టార్గెట్ 175 పెట్టుకుని క్లీన్ స్వీప్ చేస్తానంటోంది. ఆ ఎన్నికల్లో 23 సీట్లకు పరిమితమైన తెలుగుదేశం పార్టీ, ఒకే ఒక్క స్థానం గెలిచిన జనసేన ఈసారి పొత్తు పెట్టుకున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వమని, వైసీపీని ఓడించి తీరుతామని స్పష్టం చేస్తున్నాయి. ఈలోగా వెలువడిన తెలంగాణ ఫలితాలను విశ్లేషించుకుని ఏపీలోనూ ఇదే ఫలితం వస్తుందని అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలో ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ అనే సంస్థ పోల్ స్కాన్ పేరుతో నిర్వహించిన సర్వే హల్‌చల్ చేస్తోంది. డిసెంబర్ 1 వరకూ రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎలాంటి పరిస్థితి నెలకొందనే విషయంపై సర్వే చేపట్టింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఏ పార్టీ అధికారంలో వస్తుందో తేల్చి చెప్పింది. 

రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 2 లక్షల 57 వేల మంది నుంచి శాంపిల్ సేకరించింది. ప్రభుత్వ పాలన, ఎమ్మెల్యేల పనితీరు, నియోజకవర్గ పరిస్థితులు, మౌళిస సదుపాయాలు, సంక్షేమ పథకాలు వంటి అంశాల్ని పరిగణలో తీసుకుంది ఈ సంస్థ. ఈ సర్వే ప్రకారం మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం ఖాయంగా తెలుస్తోంది. రాష్ట్రంలో 113 నియోజకవర్గాల్లో అధికార పార్టీ బలంగా ఉందని..ఇప్పుడు ఎన్నికలు వస్తే 113 స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుందని పోల్ సర్వే చెబుతోంది. 

ఇక 16 నియోజకవర్గాల్లో తెలుగుదేశం-జనసేనకు వైసీపీకు మధ్య పోటీ గట్టిగా ఉంటుందని తేల్చింది. అంటే ఈ 16 స్థానాల్లో పోటీ గట్టిగా ఉండి వైసీపీకు మైనస్ అయ్యే అవకాశాలున్నాయి. ఇక మరో 46 స్థానాల్లో వైసీపీకు ఓటమి తప్పదని పోల్ సర్వే తేల్చింది. ఓటింగ్ శాతం పరంగా చూస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి 50.10 శాతం ఓట్లు దక్కించుకుంటుంది. టీడీపీ-జనసేన 43.12 శాతం ఓట్లు, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు 2.08 శాతం ఓట్లు సాధిస్తాయి. మరో 4.70 శాతం ఓటింగ్ గురించి ఈ సర్వేలో స్పష్టత లేదు. ఒకవేళ ఈ మిగిలిన శాతం కూడా టీడీపీ-జనసేనకు వచ్చినా 47 శాతానికి పరిమితం కావచ్చు. 

Also read: Dual Votes: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో డబుల్ ఎంట్రీ ఓట్లు, తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల రాజకీయం, ఈసీకు ఫిర్యాదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News