Telangana Ministers Portfolios: తెలంగాణ మూడవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మంత్రుల శాఖల కేటాయింపుపై ఇప్పటి వరకూ పుకార్లు వ్యాపించాయి. వాస్తవానికి ఇప్పటివరకూ ప్రచారంలో ఉన్నవన్నీ ఫేక్ వార్తలే. ఇప్పుడు తుది జాబితా విడుదలైంది. మంత్రుల శాఖల కేటాయింపుపై అధిష్టానంతో చర్చల తరువాత తుది జాబితా విడుదలైంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్న నేపధ్యంలో కేబినెట్‌లో చోటు దక్కించుకున్న పదకొండు మందిలో ఎవరికి ఏ శాఖ కేటాయించాలనే విషయంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. నిన్నంతా ఇదే అంశంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో చర్చలు జరిపారు. కాంగ్రెస్ అధిష్టానంతో చర్చల తరువాత ఎవరికి ఏ శాఖ అనేది ఇవాళ ప్రకటించారు. వాస్తవానికి రేవంత్ రెడ్డితో 11 మంది ప్రమాణ స్వీకారం చేసినరోజే మంత్రుల శాఖల కేటాయింపుపై వివిధ రకాలుగా పుకార్లు వ్యాపించాయి. వాస్తవానికి మంత్రులకు శాఖల కేటాయింపు అధికారింగా జరగలేదు. నిన్న తుది నిర్ణయం తరువాత ఇవాళే ఏ మంత్రికి ఏ శాఖ అనేది విడుదల చేశారు. కీలకమైన హోంశాఖతో పాటు మున్సిపాలిటీ, విద్యా శాఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనవద్దనే ఉంచుకున్నారు. ఇంకా ఎవరికీ కేటాయించలేదు. బహుశా భవిష్యత్తులో జరిగే విస్తరణలో మరొకరికి కేటాయించవచ్చు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రితో పాటు హోం, మున్సిపాలిటీ, విద్యా శాఖలు
మల్లు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంతో పాటు ఆర్ధికం, విద్యుత్ శాఖ
దామోదర రాజనర్శింహ వైద్య ఆరోగ్య శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ
ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌర సరఫరాలు, నీటి పారుదల శాఖ
సీతక్క పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా సంక్షేమం
దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాలు
కొండా సురేఖ అటవీ శాఖ, దేవాదాయ, పర్యావరణ శాఖ
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవిన్యూ, సమాచార శాఖ
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆర్ అండ్ బి, సినిమాటోగ్రఫీ
జూపల్లి కృష్ణారావు ఎక్సైజ్, పర్యాటక, పురావస్తు శాఖ
తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ, చేనేత, అనుబంధ సంస్ధల శాఖ
పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ
Also read: Double Entry Votes: ఒక వ్యక్తికి ఒకటే ఓటు, డబుల్ ఎంట్రీ ఓట్లపై చర్యలకు దిగిన ఎన్నికల సంఘం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook