Telangana Budget 2024-25: అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క.. 2024-25 కేటాయింపులు..

Hyderabad: ఆర్థిక మంత్రి మల్లు విక్రమార్క భట్టీ తెలంగాణలో ఓటాన్ అకౌంట్ బడ్జెన్ ప్రవేశ పెట్టారు.  ఈ బడ్జెట్ లో.. 2024-25 ఆర్థికసంవత్సరానికి ఓట్-ఆన్ అకౌంట్ మొత్తం వ్యయం 2,75,891 కోట్ల రూపాయలుగా తెలుస్తుంది. 

Written by - Inamdar Paresh | Last Updated : Feb 10, 2024, 12:55 PM IST
  • - తెలంగాణ అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టిన మంత్రి భట్టి..
    - ఓట్-ఆన్ అకౌంట్ మొత్తం వ్యయం 2,75,891 కోట్ల రూపాయలు
    - రెవెన్యూ వ్యయం 2,01,178 కోట్ల రూపాయలు..
Telangana Budget 2024-25: అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క.. 2024-25 కేటాయింపులు..

Telangana Budget 2024-25 Analysis: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పాలనతో తనదైన మార్కు చూపించేలా పాలన అందిస్తుంది. అసెంబ్లీలో తెలంగాణ ఆర్థిక మంత్రి మల్లు విక్రమార్క భట్టీ ఫిబ్రవరి 10న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ఈ రోజు ప్రవేశ పెట్టారు. దీనిలో భాగంగా మల్లు విక్రమార్గ అసెంబ్లీలో ప్రసంగిస్తూ.. ఓటాన్ అకౌంట్ లో వివిధ రంగాలకు కేటాయించిన కేటాయింపులపై సమగ్రంగా వివరించారు. 

మధ్యంత బడ్జెట్ లో. .రెవెన్యూ వ్యయం 2,01,178 కోట్ల రూపాయలు, మూలధన వ్యయం 29,669 కోట్లను కేటాయించినట్లు తెలుస్తుంది. అదే విధంగా ద్రవ్యలోటు 32557  కోట్లు కేటాయించినట్లు తెలుస్తోంది.  ఆరు గ్యారెంటీల కోసం 53196 కోట్లు అంచనా వేశారు. పరిశ్రమల శాఖ 2543 కోట్లను, ఐటి శాఖకు 774కోట్లు, పంచాయతీ రాజ్ 40,080 కోట్లను కేటాయించినట్లు మల్లు విక్రమార్క భర్టీ తెలిపారు. పురపాలక శాఖకు 11692 కోట్ల, మూసీ రివర్ ఫ్రాంట్ కు వెయ్యి కోట్లు కేటాయించినట్లు చెప్పారు. 

Read More: Effects Of Mobile: మొబైల్‌ యూజ్ చేయడం వల్ల మతిమరుపు వ్యాధికి స్వాగతం పలికినట్లే!

అదే విధంగా.. వ్యవసాయ శాఖ 19746 కోట్లు, ఎస్సీ, ఎస్టీ గురుకుల భవన నిర్మాణాల కోసం 1250కోట్లు, ఎస్సీ సంక్షేమం 21874 కోట్లు, ఎస్టీ సంక్షేమం 13013 కోట్లు,  మైనార్టీ సంక్షేమం 2262 కోట్లు, బీసీ సంక్షేమం, బీసీ గురుకుల భవనాల నిర్మాణం కోసం 1546 కోట్లు, బీసీ సంక్షేమం 8 వేల కోట్లు, విద్యా రంగానికి 21389 కోట్లును కేటాయించినట్లు పేర్కొన్నారు.

అదే విధంగా.. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు 500 కోట్లు, యూనివర్సిటీల్లో సదుపాయాలకు 500 కోట్లను కేటాయించినట్లు మల్లు విక్రమార్క తెలిపారు. వైద్య రంగానికి 11500 కోట్లు, విద్యుత్ - గృహ జ్యోతికి 2418కోట్లు, విద్యుత్ సంస్థలకు 16825 కోట్లు, గృహ నిర్మాణానికి 7740 కోట్లు, నీటి పారుదల శాఖ కు 28024 కోట్లను కేటాయించినట్లు మల్లు విక్రమార్క తెలిపారు.
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News