MLA Padi Kaushi Reddy Controversial Comments On Police Department: మరోసారి తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి హుజురాబాద్ లో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. కానిస్టేబుల్ నుంచి డీజీపీల వరకు ఎవర్ని వదలమని హెచ్చరించారు. అంతే కాకుండా.. కానిస్టేబుల్ నుంచి డీజీపీల వరకు ఎవర్ని వదిలే ప్రసక్తి లేదన్నారు. ప్రతి ఒక్కరికి మిత్తితో సహా చెల్లిస్తామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. భయంలేకుండా ధైర్యంగా ఉండాలన్నారు. ఎక్కడ చూసిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై కావాలని కేసులు పెడుతున్నారని, ఇలాంటి పనులు మానుకోవాలని హితవు పలికారు. తాము మోసం చేసే వాళ్లంకాదని, అన్యాయం చేసే వాళ్లం కాదన్నారు. అనవసరంగా తమ జోలికివస్తే ఎవర్నికూడ వదిలే ప్రసక్తి లేదన్నారు.
ఇదిలా ఉండగా..తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య గొడవ నువ్వా.. నేనా .. అన్న విధంగా ఆరోపణలు నడుస్తున్నాయి. మరోవైపు సీఎం రేవంత్ కూడా మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, కవితలను విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు కూడా కాంగ్రెస్ వారు ఇస్తున్న ఆరోపణలకు అంతే రేంజ్లో కౌంటర్ ఇస్తున్నారు. ఇక.. ప్రస్తుతం ఎంపీ ఎన్నికల హీట్ తెలంగాణాలో ఫుల్ పొలిటికల్ హీట్ ను పుట్టిస్తుంది. తెలంగాణ ఉద్యమ పార్టీని గెలిపించుకొవాల్సిన బాధ్యత ప్రజలకుందని బీఆర్ఎస్ ప్రజలను కోరుతుంది. మరోవైపు బీఆర్ఎస్,బీజేపీలు తొడుదొంగలని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి వస్తుందని కాషాయపార్టీ శ్రేణులు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక.. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య డైలాగ్ వార్ తెలంగాణ పాలిటిక్స్ లో మరో రేంజ్ లో హీట్ ను పుట్టిస్తున్నాయి.
ఎంపీ ఎన్నికలలో ఎక్కువ సీట్లు గెలిచి ప్రజలలో తమపట్ల సానుభావం ఉందని, కాంగ్రెస్ భావిస్తుంది. ఇక బీఆర్ఎస్.. అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయిన కూడా తమ పట్ల ప్రజలకు విశ్వాసం ఉందని అంటున్నారు. కాగా, ఇటీవల బీఆర్ఎస్ నేత బాల్కసుమన్ కూడా సీఎం రేవంత్ రెడ్డిని చెప్పుతో కొడుతానంటూ వ్యాఖ్యలు చేశారు. ఇది దుమారంగా మారింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ క్రమంలో.. తాజాగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారంగా మారాయి. దీనిపై పోలీసుశాఖ కూడా సీరియస్ గా స్పందించింది. కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తమ మనో భావాలు దెబ్బతినేలా ఉన్నాయంటూ వ్యాఖ్యలు చేసింది. హుజురాబాద్ స్థానికులు కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనతో తెలంగాణలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook