Oats Side Effects In Telugu: ఓట్స్ శరీరానికి ఎంతో మంచివి. ఇందులో ఫైబర్ పరిమాణాలు అధికమవుతాధిలో లభిస్తాయి. కాబట్టి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి ప్రతిరోజు తీసుకోవడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. దీని కారణంగా చాలామంది ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం పూట కూడా ఓట్స్‌తో తయారు చేసిన ఆహారాలను అతిగా తీసుకుంటున్నారు. నిజానికి ఓట్స్లో శరీరానికి ప్రయోజనం కలిగించే అనేక రకాల పోషకాలు ఉన్నప్పటికీ అతిగా తీసుకోవడం కారణంగా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతి రోజు మూడు పూటలు తీసుకోవడం వల్ల సమస్యలు మరింత తీవ్రతరం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే వీటిని ప్రతిరోజు తీసుకోవడం వల్ల శరీరానికి కలిగే దుష్ప్రభావాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
జీర్ణక్రియ సమస్యలను దారి తీయవచ్చు:
ఓట్స్ సహజంగా గ్లూటెన్ రహితంగా ఆహారంగా చెప్పుకుంటారు కాబట్టి ప్రతిరోజు వీటిని మూడు పూటలు ఆహారంగా తీసుకుంటే జీర్ణ క్రియ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గోధుమ, బార్లీ గింజలు కలిగిన వీటిని ప్రతిరోజు తీసుకోవడం వల్ల జీర్ణక్రియపై చెడు ప్రభావం అనే అవకాశాలు ఉన్నాయి. దీని కారణంగా ఉన్నట్టుండి జీర్ణక్రియలు సమస్యలు ఏర్పడి, దీర్ఘకాలిక వ్యాధులుగా మారే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కొంతమంది లోనైతే పొట్ట ఉబ్బరం గ్యాస్ వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఓట్స్ ను కేవలం తగిన పరిమాణంలో మాత్రమే తీసుకోవడం ఎంతో మంచిది.
రక్తంలో చక్కెర పరిమాణాలు పెరగడం:
ఓట్స్‌లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు కూడా అధిక పరిమాణంలో లభిస్తాయి. దీనివల్ల కొంతమందిలో రక్తంలోని చక్కర పరిమాణాలు ఒక్కసారిగా పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే ప్రీ-డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న వారు వీటిని అతిగా తీసుకోకపోవడం ఎంతో మంచిదని వారు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఓట్స్ డైట్‌తో బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిందేమిటంటే, ఇప్పటికే డయాబెటిస్తో బాధపడుతున్న వారు అతిగా తినడం మానుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు బరువు తగ్గాలనుకుంటే ఓట్స్ రహిత ఆహారాలను తీసుకోవడం ఎంతో మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇకపోతే రక్తంలోని చక్కెర పరిమాణాలు ఒక్కసారిగా పెరిగిపోయి. ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీయవచ్చు.
మూత్రపిండాలపై కూడా ప్రతికూల ప్రభావం:
ఓట్స్ లో ఫాస్పరస్కూడా పరిమితికి మించి ఉంటుంది. కాబట్టి రోజులో మూడు పూటలు ఓట్స్ తో ఆహారాలు తీసుకునే వారికి మూత్రపిండాల వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో లభించే భాస్వరం మూత్రపిండాల పనితీరుపై ప్రభావం చూపి దెబ్బ తీసే అవకాశాలున్నాయి. దీనికి కారణంగా వాటి ఆరోగ్యం రోజురోజుకు దెబ్బతినవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్న వారు ఓట్స్ను అధిక తీసుకోవడం మానుకోవాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి