Happy Ugadi Wishes 2024: మిత్రులకు, కుటుంబ సభ్యులకు క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, స్పెషల్ కోట్స్‌..

Happy Ugadi Wishes Ands Quotes In Telugu 2024: పురాతన కాలం నుంచి వస్తున్న పండగలు ఉగాది పండగ ఒకటి. ఈ పండగకు భారతదేశంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇలాంటి ఎంతో ప్రాముఖ్యత కలిగిన పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు..

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 9, 2024, 12:00 AM IST
Happy Ugadi Wishes 2024: మిత్రులకు, కుటుంబ సభ్యులకు క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, స్పెషల్ కోట్స్‌..

Happy Ugadi Wishes Ands Quotes In Telugu 2024: హిందువులు ఎంతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే పండగల్లో ఉగాది పండుగ ఒకటి ఈ పండగ కొత్త సంవత్సరంలోని మొదటి పండగగా భావిస్తారు. ఈ పండగను వివిధ రాష్ట్ర ప్రజలు వివిధ పేర్లతో పిలుచుకుంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు అయితే కొత్త సంవత్సరంగా పిలుస్తారు. ఈ పండగను తెలుగు ప్రజలతోపాటు కన్నడ, కొంకని ప్రజలు కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈరోజు చాలామంది రైతులు గోపూజను కూడా చేస్తారు. ఇలాంటి ఎంతో ప్రాముఖ్యత కలిగిన పండుగ రోజున మీ మిత్రులకు కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు ఇలా సోషల్ మీడియా ద్వారా తెలియజేయండి.

టాప్ 10 క్రోధినామ సంవత్సర ఉగాధి శుభాకాంక్షలు
1. శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు! ఈ సంవత్సరం మీకు శ్రేయస్సు, ఆరోగ్యం, సంపదలను తీసుకురావాలని కోరుకుంటున్నాము.

2. ఉగాది పండుగ ప్రత్యేక శుభాకాంక్షలు.. ఈ సంవత్సరం మీరు అన్ని విధాలా విజయవంతం కావాలని ఆశిస్తున్నాము.

3. క్రోధినామ సంవత్సరంలో మీకు అన్ని విధాల శుభం కలిగి.. ఈ సంవత్సరం మీ కలలు నెరవేరాలని.. మీ జీవితం ఆనందం నిండాలని కోరుకుందాం..

4. ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీకు కొత్త ఆరంభాలను, కొత్త అవకాశాలను తీసుకురావాలని ఆశిద్దాం.

5. క్రోధినామ సంవత్సరం మీకు శుభం కలిగించి.. శక్తి, ధైర్యం, స్థిరత్వం నింపాలని కోరుకుంటూ..శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు. 

6. ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీకు శ్రేయస్సు, ఆరోగ్యం, సంపదలను తీసుకురావాలని మనసారా ఆ వినాయకుడిని కోరుకుందాం..

7. ఈ సంవత్సరం మీ కుటుంబంతో పాటు స్నేహితులతో ఆనందంగా గడపాలని ఆశిస్తూ..క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. 

8. ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో అన్ని పనులంలో విజయాలు సాధించాలని కోరుకుంటున్నాము.

9. క్రోధినామ సంవత్సరంలో కొత్త ఆలోచనలు, కొత్త సృజనాత్మకతతో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం.

10. మీకు, మీ తోటి స్నేహితులకు తెలుగు మొదటి పండగ ఉగాది శుభాకాంక్షలు. 

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News