Viral video: అట్లుంటదీ మల్ల.. నరసింహ మూవీ స్టైల్ లో పాముకు కిస్ ఇచ్చిన తాత.. వీడియో వైరల్..

Snakes viral news: పొట్టకు పెద్దాయన పామును చుట్టుకున్నాడు. అంతటితో  ఆగకుండా.. నడి రోడ్డుమీద పామును ముద్దుకుడా పెట్టుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Jun 20, 2024, 10:48 AM IST
  • రోడ్డుపైన మందు బాబు హల్ చల్..
  • పామును పట్టుకుని పరాచకాలు..
Viral video: అట్లుంటదీ మల్ల.. నరసింహ మూవీ స్టైల్ లో పాముకు కిస్ ఇచ్చిన తాత.. వీడియో వైరల్..

Snake viral video: మనలో చాలా మంది విషసర్పాలను చూడగానే భయంతో వణికిపోతారు. పాములున్న చోట చచ్చిన కూడా పోరు. ఇక మరికొందరైతే పాములు అని పలకడానికి కూడా అస్సలు ఇష్టపడరు. కానీ మరికొందరు పాములు కన్పిస్తే వాటితో ఆడుకుంటారు. మెడలో వేసుకుంటారు. పట్టుకుని ఆడుకొవడానికి ప్రయత్నిస్తుంటారు. అడవులు, పాములు,  వర్షాకాలంలో పాములు ఎక్కువగా బైటకు వస్తుంటాయి. పొలాల్లో కూడా పాములు ఎక్కువగా కన్పిస్తాయి.  ఈ కాలంలో రైతులు ఎక్కువగా పాముకాటుకు గురౌతుంటారు. అయితే.. కొందరు మందుబాబులు తాగిన మైకంలో వింతగా ప్రవర్తిస్తుంటారు. రోడ్డుమీద తూలుతుంటారు.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Yaswanth Reddy Nagireddy (@yaswanth._)

మనుషుల పట్ల,నోరులేని జీవాల పట్ల వింతగా ప్రవర్తిస్తుంటారు.. ఇదిలా ఉండగా.. కొందరు తాగిన మైకంలో పాములతో ఆడుకున్న వీడియోలు గతంలో అనేకం వార్తలలో నిలిచాయి. కొన్నిసార్లు మందుబాబులు.. తాగిన మైకంలో పాములతో వింతగా ప్రవర్తించిన ఫన్నీ ఘటనలు జరిగాయి. తాజాగా,  ఏపీలో ఒక మందుబాబు తాగి రోడ్డుపైన మందుబాబుకు కిస్ ఇచ్చాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

పూర్తి వివరాలు..
 
ఆంధ్ర ప్రదేశ్ లోని కడపజిల్లా జమ్మల మడుగులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక పెద్దాయన..మందు తాగి రోడ్డుపై వస్తున్న క్రమంలో ఒక పాము కన్పించింది. పామును చూడగానే ఏమాత్రం భయపడలేదు. దాన్నిచేతిలోకి తీసుకుని నడుముకు బెల్టులాగా చుట్టుకున్నాడు. దీంతో అతడిని చుట్టు పక్కల వారు వింతగా చూస్తు ఉండిపోయారు. అతను మాత్రం అదే పట్టనట్టుగా.. మరోచేతిలో సిగరేట్ వెలిగించుకుని నరసింహ మూవీలో రజినీకాంత్ లా స్టైల్ గా పామును ముద్దుపెట్టుకున్నాడు.

Read more: Tears of camels: ఒంటె కన్నీరు పాముకాటుకు విరుగుడుగా పనిచేస్తుందంట... అసలు స్టోరీ ఏంటంటే..?

ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. పాము కూడా అతనికి ఏమాత్రం హనీ కల్గించలేదు. రోడ్డుపైన ఉన్న వారు అతని చేష్టలు చూస్తు ఉండిపోయారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు వామ్మె.. ఇదేందిరా అయ్యా.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. అది పొరపాటున కాటు వేస్తే.. నీ పరిస్థితి ఏంటని కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు ఇతడు స్టైల్ లో.. రజనీకాంత్‌ను మించిపోయాడుగా అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

Trending News