Movie Cricket: నిహారిక, బన్ని వాస్ టీమ్స్ మధ్య క్రికెట్ వార్.. ‘ఆయ్’ టీమ్ వర్సెస్ ‘కమిటీ కుర్రాళ్లు’ ..

Movie Cricket: టాలీవుడ్ సినీ పరిశ్రమ రోజు రోజుకు అభివృద్ధి చెందుతుంది. వెరైటీ కథలతో సినిమాల రూపొందించడానికి మన మేకర్స్ ఇంట్రెస్ట్ చూపెడుతున్నాడు. సినిమా కత, మేకింగ్ విషయాల్లోనే కాదు.. ప్రమోషన్స్ పరంగా వెరైటీగా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో నిహారిక, బన్ని వాస్ సినిమా టీమ్స్ మధ్య వినూత్నంగా క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది.  

Written by - TA Kiran Kumar | Last Updated : Jul 19, 2024, 12:40 PM IST
Movie Cricket: నిహారిక, బన్ని వాస్ టీమ్స్ మధ్య క్రికెట్ వార్.. ‘ఆయ్’ టీమ్ వర్సెస్ ‘కమిటీ కుర్రాళ్లు’ ..

Movie Cricket:నిహారిక నిర్మాతగా ‘కమిటీ కుర్రాళ్లు’ సినిమా తెరకెక్కుతోంది. మరోవైపు బన్ని వాస్ నిర్మాణంలో ‘ఆయ్’ మూవీ తెరకెక్కుతోంది. ఈ రెండు సినిమా టీమ్స్ ప్రేక్షకులను దగ్గర కావడానికి వినూత్నమైన ప్రమోషన్స్ ను చేయడానికి రెడీ అవుతున్నారు. ‘ఆయ్’ సినిమా ఆగ‌స్ట్ 15న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా నార్నే నితిన్ హీరోగా నటిస్తున్నాడు. ఎన్టీఆర్ బామ్మర్దిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఇతను విభిన్న కథలతో తెలుగు చిత్ర పరిశ్రమలో కథానాయకుడిగా సత్తా చూపించే ప్రయత్నంలో ఉన్నారు. మరోవైపు నిహారిక నిర్మాణంలో తెరకెక్కుతోన్న ‘కమటీ కుర్రాళ్లు’ సినిమా  ఆగష్టు నెలలో విడుదల కాబోతుంది. ఆగష్టులో పోటీకి సిద్దపడుతున్న ఈ రెండు సినిమాలు సంబంధించిన యూనిట్ క్రికెట్ పోటీకి సిద్ధమయింది.

ఈ రోజు ఆయ్  సినిమా టీమ్ తో కమిటీ కుర్రాళ్లు సినిమా యూనిట్ క్రికెట్ ఆడబోతున్నారు.

రెండు టీమ్స్ మ‌ధ్య జ‌ర‌గ‌బోయే క్రికెట్ మ్యాచ్‌కు సంబంధించి బ‌న్నీ వాస్‌, నిహారిక కొణిదెల మ‌ధ్య జ‌రిగిన స‌ర‌దా  సరదా సంభాషణలు..చాలెంజ్‌లు అంద‌రిని అట్రాక్ట్ చేస్తున్నాయి. బ‌న్నీ వాస్ విసిరిన చాలెంజ్‌ను నిహారిక కొణిదెల స్వీక‌రించారు. క‌చ్చితంగా ఆయ్ టీమ్ మీద తమ క‌మిటీ కుర్రోళ్ళు టీమ్ విజ‌యం సాధిస్తుంద‌ని ఆమె న‌మ్మ‌కంగా ఉన్నారు. జూలై 19 సాయంత్రం ఆరు గంట‌ల‌కు జ‌ర‌గ‌బోయే మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. నువ్వు గెలుస్తావా.. అంటే నువ్వు గెలుస్తావా అంటూ సాగిన చిట్ చాట్ సరదగా ఉంది. ఈ రెండు సినిమాల మధ్య కామన్  విష‌య‌మేమంటే ఈ రెండు సినిమాలు గోదావ‌రి బ్యాక్ డ్రాప్‌తోనే తెర‌కెక్కడం విశేషం. క్రికెట్‌, మూవీ ల‌వ‌ర్స్‌ను ఈ మ్యాచ్ ఆక‌ట్టుకుంటుంద‌నటంలో సందేహం లేదు.

ఆయ్ సినిమా గురించి:

ఈ సీజ‌న్‌లో తిరుగులేని ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా  ‘ఆయ్’ చిత్రం రాబోతుంది. నార్నే నితిన్‌, న‌య‌న్ సారిక‌, రాజ్ కుమార్ క‌సిరెడ్డి, అంకిత్ కొయ్య త‌దిత‌రులు ఇందులో లీడ్ రోల్స్ లో నటించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగ‌స్ట్ 15న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.అంజి కె.మ‌ణిపుత్ర ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.  యంగ్ అండ్ టాలెంటెడ్ ప్రొడ్యూస‌ర్‌ బ‌న్నీ వాస్‌, విద్యా కొప్పినీడి సినిమాను నిర్మిస్తున్నారు.మెగా ప్రొడ్యూసర్ అల్లు అర‌వింద్ సినిమాకు స‌మ‌ర్ప‌కుడిగా వ్యవహరిస్తున్నారు. కిర‌ణ్ కుమార్ మ‌న్నె ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా పనిచేస్తున్నారు. స‌మీర్ క‌ళ్యాణి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. రామ్ మిర్యాల సంగీతాన్ని అందిస్తున్నారు.

క‌మిటీ కుర్రోళ్ళు సినిమా గురించి:

నిహారిక కొణిదెల స‌మర్ప‌ణ‌లో ‘క‌మిటీ కుర్రోళ్ళు’ చిత్రం  ఈ సినిమా తెరెకెక్కుతోంది. అంతేకాదు ఈ సినిమా  సినీ ప్రేక్ష‌కులను మెప్పిస్తుందనే నమ్మకం వ్యక్తం చేసారు. ఈ సినిమా కూడా ఆగ‌స్ట్‌లోనే రిలీజ్ కాబోతుంది. సందీప్ స‌రోజ్‌, య‌శ్వంత్ పెండ్యాల‌, త్రినాథ్ వ‌ర్మ‌, ప్ర‌సాద్ బెహ‌రా, ఐశ్వ‌ర్య ర‌చిరాజు, మ‌ణికాంత ప‌రుశు, లోకేష్ కుమార్ ప‌రిమి, శ్యామ్ క‌ళ్యాణ్, ర‌ఘువ‌ర‌న్‌, శివ కుమార్ మ‌ట్ట‌, అక్ష‌య్ శ్రీనివాస్‌, శ‌ర‌ణ్య సురేష్, తేజ‌స్వి రావ్‌, విషిక‌, ష‌ణ్ముకి నాగుమంత్రి త‌దిత‌రులు ఈ సినిమాలో లీడ్ రోల్స్ లో యాక్ట్ చేశారు. య‌దు వంశీ ద‌ర‌క్శ‌క‌త్వంలో  పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై   పద్మజ కొణిదెల,జయలక్ష్మి అడపాక ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!

ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News