Purushothamudu: రాజ్ తరుణ్ పురుషోత్తముడు ట్రైలర్ విడుదల.. ఈసారి గట్టిగా ప్లాన్ చేసిన హీరో!

Purushothamudu Trailer: గత కొద్దిరోజులుగా కొన్ని కాంట్రవర్సరీలో చిక్కుకున్న హీరో రాజ్ తరుణ్. మరోపక్క వరస సినిమాలతో దూసుకుపోతున్నారు ఈ యంగ్ టాలెంటెడ్ హీరో. రాజ్ తరుణ్ హీరోగా చేసిన తిరగబదరా స్వామి ఇంకా విడుదల కాకముందే.. ఇప్పుడు పురుషోత్తముడు అనే మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు మీకోసం..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jul 20, 2024, 11:22 AM IST
Purushothamudu: రాజ్ తరుణ్ పురుషోత్తముడు ట్రైలర్ విడుదల.. ఈసారి గట్టిగా ప్లాన్ చేసిన హీరో!

Raj Tharun Purushothamudu Trailer: రాజ్ తరుణ్ హీరోగా చేసిన తిరగబడరా స్వామి త్వరలోనే విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ హీరో  నటిస్తున్న మరో కొత్త సినిమా పురుషోత్తముడు కూడా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాని.. శ్రీ శ్రీదేవి నిర్మాణ సంస్థ పై డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా తో హాసిని సుధీర్ హీరోయిన్ గా పరిచయమవుతున్నారు. 

ఆకతాయి, హమ్ తుమ్ సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు.. రామ్ భీమన పురుషోత్తముడు సినిమాను రూపొందిస్తున్నారు. కాగా ఈ సినిమాలో రాజ్ తరుణ్ తో పాటు బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, మురళి శర్మ, రమ్య కృష్ణ,  ముకేష్ ఖన్నా వంటి స్టార్ నటులు కూడా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రం ఈ నెల 26వ తేదీన ప్రపంచవ్యాప్తం విడుదలకు సిద్ధమవుతున్న కారణంగా…ఈ రోజు ఈ చిత్ర ట్రైలర్ ను సినిమా యూనిట్ రిలీజ్ చేశారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News