ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీరుపై ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీడియ పాయింట్ వద్ద రాజధాని అభివద్ది ని వైసీపీ సర్కార్ వెనక్కి నెడుతోందని విమర్శించారు.
రియల్ ఎస్టేట్ కుదేల్
అమరావతి పరిధిలో రూ.2 లక్షల కోట్ల విలువైన భూమి ఉందని ..జగన్ అధికారంలో వచ్చిన తర్వాత రాజధానిలో రియల్ ఎస్టేట్ రంగం కూడా పడిపోయిందని ఆరోపించారు. నిర్మాణాలు ఆగిపోవడంతో రాజధాని ప్రాంతంలోని చాలామంది కూలీలకు ఉపాధి దొరకడం లేదని చంద్రబాబు చెప్పారు.
విమాన రాకపోకలు తగ్గాయ్
ఇటు గన్నవరంలో విమాన రాకపోకలు తగ్గిపోయాయని ...సింగపూర్ విమానంతో పాటు చాలా విమానాలను రద్దు చేయడంతో ఎక్కడికి వెళ్లాలన్నా మళ్లీ హైదరాబాద్ వెళ్లాల్సిన పరిస్థితి వస్తోందని చంద్రబాబు అన్నారు. ఇలా జగన్ అనుసరిస్తున్న విధానాలతో రాజధాని పరిధిలో వ్యవస్థలన్నీ కుదేలవుతున్నాయని ఆరోపించారు
పులివెందుల తరహా రాజకీయాలు
జగన్ హయంలో అరాచక పాలన కొనసాగుతోందని విమర్శించారు. రాజధాని అమరావతిలో పులివెందుల తరహా పంచాయితీలు, రాజకీయాలు చేస్తే కుదరదని హెచ్చరించారు. బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడటం మానుకోవాలని ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులకు చంద్రబాబు హితవు పలికారు.