Konda Surekha: క్షమాపణలు చెప్పని కొండా సురేఖ.. కానీ 'ఆ కామెంట్లు' వెనక్కి తీసుకున్న మంత్రి

Konda Surekha Take Backs His Words About Naga Chaitanya Samantha Divorce: తాను చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో మంత్రి కొండా సురేఖ స్పందించారు. తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Oct 3, 2024, 11:18 AM IST
Konda Surekha: క్షమాపణలు చెప్పని కొండా సురేఖ.. కానీ 'ఆ కామెంట్లు' వెనక్కి తీసుకున్న మంత్రి

Konda Surekha Resignation: అత్యంత హేయంగా.. నీచాతి నీచంగా చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపడంతో.. సినీ పరిశ్రమ అంతా ఒక్కతాటిపైకి వచ్చి ఖండించింది. చీవాట్లు ఒక్కటే తక్కువ అనే రీతిలో ఆగ్రహం వ్యక్తమవడంతో కొండా సురేఖ ఒక రోజు తర్వాత స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే క్షమాపణలు మాత్రం చెప్పకపోవడం గమనార్హం.

Also Read: Nani: కొండా సురేఖ వ్యాఖ్యల దుమారం.. ఖండఖండాలుగా ఖండించిన హీరో నాని

 

తన వ్యాఖ్యలు రాజకీయంగానే కాకుండా పూర్తి సమాజం తప్పుబట్టిన వేళ కొండా సురేఖ గురువారం స్పందించి మీడియాతో మాట్లాడారు. 'కేటీఆర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్లే  భావోద్వేగంతో  నిన్న నేను గాంధీభవన్ లో మాట్లాడాల్సి వచ్చింది. కేటీఆర్ గతంలో వ్యవహరించిన తీరు.. మహిళలను చులకనగా చూసిన విధానం.. ఆయన వ్యక్తిగతం గురించి విమర్శలు చేయాల్సి వచ్చింది. ఆ సందర్భంలో నాకు ఇంకెవరిపైన  ద్వేషంగానీ కోపంగాని నాకు లేవు' అని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

Also Read: Naga Chaitanya: మీ మాటలు బాధను కలిగించాయి.. చాలా సిగ్గునీయం: కొండా సురేఖపై నాగ చైతన్య ఫైర్‌

 

'అనుకోని ఆ సందర్భంలో ఒక కుటుంబం గురించి తీయడం అది అనుకోకుండా నా నోటి నుండి వచ్చింది. ఆ కుటుంబం ట్వీట్ చూసిన తర్వాత నేను చాలా బాధపడ్డాను. నేను ఏ విషయంలోనైతే బాధపడుతున్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పించాను అని తెలిసి రాత్రి  నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ ట్వీట్ చేశాను. నాకు జరిగిన అవమానం.. బాధ ఇంకొకరికి జరగకూడదని బేషరతుగా నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నా' అని కొండా సురేఖ తెలిపారు.

క్షమాపణలు చెప్పని వైనం?
అయితే తాను కేటీఆర్ విషయంలో తగ్గేదే లేదు అని సురేఖ స్పష్టం చేశారు. 'నా విషయంలో క్షమాపణ చెప్పి తీరాల్సిందే! తాను క్షమాపణ చెప్పకుండా నన్నే క్షమాపణ చెప్పాలనడం  దొంగే దొంగ అన్నట్లుంది. కేటీఆర్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గేది లేదు' అని తెలిపారు. తాను చేసిన వ్యాఖ్యలపై అధిష్టానం కూడా తీవ్రంగా తప్పుబట్టినట్లు సమాచారం. తమిళ్‌, హిందీ, మలయాళం, కన్నడ ఇలా అన్ని భాషల సినీ పరిశ్రమ వారు స్పందించడంతో ఢిల్లీ పెద్దలు టీపీసీసీ అధ్యక్షుడితో మాట్లాడి దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

రంగంలోకి అధిష్టానం
వెంటనే మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ రంగంలోకి దిగి కొండా సురేఖతో మాట్లాడించినట్లు చర్చ జరుగుతోంది. అయితే కొండా సురేఖ మాత్రం క్షమాపణలు చెప్పేందుకు వెనకడుగు వేస్తున్నారు. 'వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా' అని చెప్పారే కానీ క్షమాపణలు.. చింతిస్తున్నా అని ప్రకటన చేయలేదు. దీని బట్టి చూస్తే సురేఖ తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నట్లు నమ్మాల్సి వస్తోంది. కాగా ఈ పరిణామంతో త్వరలోనే కొండా సురేఖ మంత్రి పదవి ఊడిపోయే ప్రమాదం ఉందని చర్చ జరుగుతోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News