Revanth Reddy: వరంగల్ దద్దరిల్లేలా.. రేవంత్ సభ..

Revanth Reddy Prajapalana Vijayotsava Sabha: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించనున్న ప్రజాపాలన విజయోత్సవాలకు వరంగల్ సిద్ధమైంది.  ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో ప్రజాపాలన విజయోత్సవ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.  

Written by - TA Kiran Kumar | Last Updated : Nov 19, 2024, 12:06 PM IST
Revanth Reddy: వరంగల్ దద్దరిల్లేలా.. రేవంత్ సభ..

Revanth Reddy Prajapalana Vijayotsava Sabha:  తెలంగాణ ఇచ్చిన పార్టీగా 2014, 2018 ఎన్నికల్లో ప్రజలు మాత్రం తెలంగాణ తెచ్చిన టీఆర్ఎస్ కు అధికారం కట్టబెట్టారు. అయితే.. గత ప్రభుత్వంపై పెద్దగా వ్యతిరేకత లేకున్నా.. స్థానికంగా ఉండే నాయకులపై ఉండే వ్యతిరేకత కేసీఆర్ పుట్టి ముంచింది. అంతేకాదు కొన్ని విషయాల్లో కేసీఆర్ ఒంటెద్దు పోకడలు వంటివి కాంగ్రెస్ పార్టీకి వరంగా మారి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అంతేకాదు త్వరలో ప్రభుత్వం ఏర్పాటు చేసి యేడాది పూర్తి కావొస్తోన్న సందర్భంగా ప్రజా పాలన విజయోత్సవ సభను వరంగల్ లో నిర్వహించడానికీ రెడీ అవుతున్నారు.

ఇప్పటికే వరంగల్ సభ ప్రాంగణాన్ని మంత్రులు శ్రీధర్‌ బాబు, సీతక్క,  కొండా సురేఖ, ఎమ్మెల్యేలు పరిశీలించారు. ఇదే సభా ప్రాంగణం నుంచి వరంగల్ నగరంలోని వివిధ అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ముఖ్యంగా దాదాపు పదేళ్ల నుంచి ప్రారంభోత్సవానికి నోచుకోకుండా ఉన్న కాళోజీ కళాక్షేత్రానికి ఈ సభలోనే మోక్షం కలగనుంది. దాంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తంగా 4 వేల 962 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా పలు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నట్టు మాచారం.

ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా వరంగల్ లో నిర్వహించే వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 2.30 గంటలకు హాజరుకానున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలీక్యాప్టర్ లో మధ్యాహ్నం 2:30 గంటలకు హనుమకొండలోని కుడా గ్రౌండ్ హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అనంతరం ఆ పక్కనే ఉన్న కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభిస్తారు.కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీని సందర్శిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆర్ట్స్ కాలేజ్ లో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభ వేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శించి.. మహిళా స్వయం సహాయక సంఘాలు, మండల సమాఖ్య, జిల్లా సమాఖ్య సభ్యులతో ముఖాముఖి మాట్లాడుతారు. విజయోత్సవ సభకు లక్ష మంది హాజరు అయ్యే అవకాశముంది. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. భారీగా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

రాష్ట్రంలోని 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచే శంకుస్థాపన చేస్తారు. ఆ తరువాత ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా బ్యాంక్ లింకేజ్ చెక్కులు, బీమా చెక్కులు పంపిణీ చేస్తారు. అనంతరం వేదికపై ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ఆ తరువాత హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమవుతారు.

ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..

ఇదీ చదవండి:  Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

 

Trending News