cigarette found in bawarchi biryani video: ఇటీవల కాలంలో హైదరాబాద్ లో ఫుల్ క్వాలీటీలో లిస్ట్ ప్లేస్ లో ఉన్నట్లు తెలుస్తొంది. భార్యనగరానికి తమ మానికంగా బిర్యానీ అని చెప్తుంటారు. అయితే.. అలాంటి బిర్యానీలో కూడా అనేక కల్తీ ఘటనలు జరుగుతున్నట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు బిర్యానీలో పురుగులు, బొద్దింకలు, జంతువుల అవశేషాలు రావడం మనం చూశాం. కొన్ని స్టాల్ లలో ఎక్స్ పైరీ అయి పోయిన పదార్థాలను సైతం ఉపయోగించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
దీంతో కస్టమర్ లు అధికారులకు ఫిర్యాదు చేస్తే..ఏవో నామ మాత్రపుకేసులు బుక్ చేసి, జరిమానాలు విధించి వెళ్లిపోతున్నారు.ఆ తర్వాత మరల వాళ్లు మాములుగా తమ బిజినెస్ చేసుకుంటున్నారు. దీంతో చాలా మంది కస్టమర్లు ఫుడ్ సెఫ్టీపైన అధికారుల తీరు పట్ల మండిపడుతున్నారు.
బావర్చి బిర్యానీలో సగం తాగిన సిగరెట్ పీక..
హైదరాబాద్ - RTC ‘X’ రోడ్డు వద్ద బావర్చీ రెస్టారెంట్లో చికెన్ బిర్యానీ తింటుండగా కస్టమర్లకు చివర్లో సిగరెట్ పీక వచ్చింది.. దీంతో పీక చూసి కస్టమర్లు షాకయ్యారు
దీంతో కస్టమర్లంతా యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. pic.twitter.com/00J6XpFMJL
— Telugu Scribe (@TeluguScribe) November 25, 2024
ఈ క్రమంలో ఇటీవల హైదరాబాద్ లోని పలు రెస్టారెంట్లు, హోటల్స్, బేకరీల మీద ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. దీనిలో దొరికిన అనేక పదార్థాలను స్వాధీనం చేసుకుని కేసులు, జరిమానాలు విధించారు. తాజాగా, ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని బావార్చి బిర్యానీ షాపుకు వెళ్లిన కస్టమర్లుకు షాకింగ్ అనుభవం ఎదురైంది. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు..
బిర్యానీ తినేందుకు కొంత మంది ఫ్రెండ్స్ తో కలిసి ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని బావార్చి హౌస్ కు వెళ్లారంట. అక్కడ బిర్యానీ ఆర్డర్ చేశారు. ఆ తర్వాత వారికి బిర్యానీలో ఏదో వెరైటీగా కన్పించింది.ఏంటని చూడగా.. అది సిగరేట్ పీక. దీంతో అక్కడున్న వాళ్లను ప్రశ్నించగా.. విసుక్కున్నట్లు తెలుస్తొంది.దీంతో వీరు వీడియో తీసి.. అక్కడున్న వారిని గట్టిగా నిలదీసినట్లు తెలుస్తొంది.
ఈ క్రమంలో బావార్చి సిబ్బంది మాత్రం.. అస్సలు పట్టనట్టుగా.. మరో బిర్యానీ ఇస్తామని కూడా సింపుల్ గా చెప్పినట్లు తెలుస్తొంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు మాత్రం షాక్ అవుతున్నారు. ఇంకేం చూడాలి తినే బిర్యానీలో అంటు నెటిజన్ లు కామెంట్లు చేస్తున్నారంట.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.