Case filed against lakshmis ntr actor sri tej: ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం కూటమి వర్సెస్ వైసీపీ రాజకీయాలు కాకరేపుతున్నాయి. ముఖ్యంగా ఏపీ సర్కారు ఇటీవల సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు, ట్రోలింగ్ లకు పాల్పడిన వారిపై కఠినంగా వ్యవహరిస్తుంది. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం.. ట్రోలర్స్ కు దిమ్మతిరిగే విధంగా షాక్ లు ఇస్తున్నారు. ఇప్పటికే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, పోసాని, శ్రీరెడ్డి లపై కేసులు నమోదైన విషయం తెలిసిందే.
గతంలో వీరంతా.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, ఆయన సతీమణిపై ఇష్టమున్నట్లు సోషల్ మీడియాలో ట్రోలింగ్స్, వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో వీరిపై ఇటీవల కేసులు నమోదయ్యాయి. అయితే.. మరోవైపు వైసీపీ మాత్రం.. తమను అణచివేసేందుకు చంద్రబాబు సర్కారు.. ఇలా ప్రతీకార రాజకీయాలు చేస్తుందని మండిపడుతున్నారు.
అదే విధంగా మహిళలపై అఘాయిత్యాలు జరక్కుండా కఠినంగా చర్యలు తీసుకొవాలని కూడా.. చంద్రబాబు సర్కారు పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం లక్ష్మీస్ ఎన్టీఆర్ లో చంద్రబాబు పాత్రలో నటించిన శ్రీతేజపై తెలంగాణలో కేసు నమోదైంది.
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో.. చంద్రబాబు పాత్రలో.. శ్రీతేజ్ నటించాడు. గతంలో ఇతను ఒక యువతిని ట్రాప్ చేసి.. పెళ్లి పేరుతో మోసం చేశాడని సదరు యువతి..హైదరబాద్ లోని కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అయితే.. గతంలో కూడా.. శ్రీతేజ్ పై మాదాపూర్ లో పీఎస్ లో కూడా కేసు నమోదైనట్లు సమాచారం.
ఒక పెళ్లైన మహిళతో ఆయన వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపణలపైకేసు నమోదైంది. ఈ క్రమంలో తాజాగా, మరోసారి కేసు నమోదు కావడం మాత్రం పెనుదుమారంగా మారిందని చెప్పుకొవచ్చు. ఈ ఘటన ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో కూడా చర్చనీయాంశంగా మారిందని తెలుస్తొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.