Konda Surekha Crimimal Case: తెలంగాణ మంత్రి కొండా సురేఖ సభ్య సమాజం తల దించుకునేలా చేసిన అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు కోర్టులో విచారణ నడుస్తోంది. తాజాగా కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (కల్వకుంట్ల తారక రామారావు) రూ. 100 కోట్లకు పరువు నష్టం దావా దాకలు చేశారు. .తనపై అనుచిత వ్యాఖ్యలు చేసి తనతో పాటు తన ఫ్యామిలీ పరువుకు భంగం కలిగించారని..మాజీ మంత్రి కేటీఆర్ నాంపల్లి కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే కదా. మరోవైపు నాగార్జున కూడా కొండా సురేఖపై తమ కుటుంబ పరువు బజారున పడేసేలా చేసిన వ్యాఖ్యలు కోర్టులో డిపామేషన్ కేసు దాఖలు చేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా మంత్రి కొండా సురేఖపై కేసు నమోదైంది. CC నెంబర్ 490/2024, 336BNS యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సినీ నటుడు అక్కినేని నాగార్జున వేసిన పిటిషన్‌పై న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ఆమె పై రూ. 100 కోట్ల పరువు నష్టం కేసు దాఖలు చేసిన సంగతి తెలిసిందే కదా. అలాగే మంత్రి కొండాకు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. డిసెంబర్ 12న పర్సనల్ గా కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే కదా.
టాలీవుడ్ హీరో, హీరోయిన్ జంట అక్కినేని నాగచైతన్య, సమంత విడాకులు తీసుకోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కారణమంటూ మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు కేటీఆర్.. సమంత పై మనసు పడ్డారని .. తన దగ్గరకు పంపించమని నాగార్జునను కోరినట్టు కొండా సురేఖ వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలు తెలంగాణ సహా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తీవ్ర దుమారాన్ని రేపాయి. మంత్రి వ్యాఖ్యలను అక్కినేని నాగార్జునతో పాటు ప్రతి ఒక్క ఇండస్ట్రీ వ్యక్తి తీవ్రంగా ఖండించారు. చివరకు కొండా సురేఖ వ్యాఖ్యలపై నాంపల్లి కోర్టును నాగార్జున ఆశ్రయించిన సంగతి తెలిసిందే కదా. క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రొసిజర్ ప్రకారం పిటిషనర్ వాంగ్మూలాన్ని న్యాయస్థానం రికార్డు చేసింది. నాగార్జున స్టేట్‌మెంట్ తర్వాత సాక్షుల స్టేట్‌మెంట్‌లను కోర్టు రికార్ చేసిన సంగతి తెలిసిందే కదా.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter