BRS Maha Dharna: మనుకోటలో రచ్చరచ్చ.. కేటీఆర్‌పై గులాబీ లీడర్ల గుస్సా! !

Warangal Politics: మహబూబాబాద్‌లో బీఆర్‌ఎస్‌ మహాధర్నా బెడిసికొట్టిందా..! మహాధర్నాలో ఆ ఇద్దరు నేతలకు ప్రాధాన్యత ఇవ్వడంపై సొంత పార్టీలోనే రచ్చ జరుగుతోందా..! గతంలో భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతను పక్కన పెట్టుకుని కేటీఆర్ ఏం సందేశం ఇస్తారని గులాబీ శ్రేణులే ప్రశిస్తున్నారు..! ఇంతకీ మానుకోటలో బీఆర్‌ఎస్‌ చేపట్టిన దీక్ష బూమరాంగ్‌ అయ్యిందా.. 

Written by - G Shekhar | Last Updated : Nov 29, 2024, 05:50 PM IST
BRS Maha Dharna: మనుకోటలో రచ్చరచ్చ.. కేటీఆర్‌పై గులాబీ లీడర్ల గుస్సా!  !

Warangal Politics: లగచర్ల బాధితులకు మద్దతుగా మానుకోటలో బీఆర్‌ఎస్ పార్టీ చేపట్టిన మహాధర్నా ఇప్పుడు సొంత పార్టీలోనే మంటలు పుట్టిస్తోంది. గులాబీ పార్టీ మహాధర్నాపై సొంత పార్టీ లీడర్లే సెటైర్లు వేయడం హాట్‌ టాపిక్‌గా మారింది. లగచర్లలో పేదల పక్షాన పోరాటం అంటూ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మానుకోటలో మహాధర్నాకు పిలుపునిచ్చారు. ఈ ధర్నా ఇంచార్జ్‌ బాధ్యతలు జిల్లా నేతలైన తక్కెళ్లపల్లి రవీందర్‌ రావు, మాజీ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్ కు అప్పగించినట్టు తెలుస్తోంది. అయితే జిల్లా అధ్యక్షురాలిగా మాలోత్‌ కవిత ఉన్నారు. అటు మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కూడా ఇదే జిల్లా నేత.. కానీ వీరికి కాకుండా గతంలో భూకజ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలకు బాధ్యతలు అప్పగించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

మానుకోటలో మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ రెండుసార్లు విజయం సాధించారు. బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక.. 2014లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో మరోసారి గెలుపొందారు. అయితే ఈ పదేళ్ల కాలంలో శంకర్‌ నాయక్‌పై అనేక భూ కబ్జా ఆరోపణలు ఉన్నాయి. పేదల భూములు కబ్జాలు చేశారని కేసులు సైతం నమోదయ్యాయి. అటు తక్కెళ్ల పల్లి రవీందర్‌ రావుపై కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. గతంలో అనేక భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొన్న నేతలు.. ఇప్పుడు లగచర్లలో పేదల పక్షాన పోరాటం చేయడం ఏంటని సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారట. అవినీతిలో పూర్తిగా కూరుకుపోయిన నేతలను పక్కన పెట్టుకుని కేటీఆర్‌ చేస్తున్న పోరాటంపైనా ఆసక్తికర చర్చ జరుగుతోందట.

ఇక మహబూబాబాద్ మహాధర్నాలో మాలోత్‌ కవిత, మాజీమంత్రి సత్యవతి రాథోడ్‌ లంబాడీ భాషలో అదరగొట్టారు. కానీ సొంత సామాజికవర్గం నేతలకు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే శంకర్ నాయక్‌ మాట్లాడిన తీరుపైన చర్చ జరుగుతోంది. మరోవైపు లగచర్ల రైతులు 9 నెలలుగా నిరసన తెలుపుతున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదన్నారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చి సంవత్సరం కావొస్తున్నా 6 గ్యారెంటీలు అమలు కాలేదని ఆరోపించారు. రైతులకు టైం ఇవ్వని సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి క్యూ కడుతున్నారని కేటీఆర్‌ మండిపడ్డారు. లగచర్ల రైతులకు సంఘీభావంగా బీఆర్‌ఎస్‌ మహబూబాబాద్‌లో నిర్వహించిన మహాధర్నాలో కేటీఆర్‌ పాల్గొన్నారు.

అయితే బీఆర్‌ఎస్‌ మహాధర్నాపై ఓరుగల్లు కాంగ్రెస్‌ నేతలు సెటైర్లు వేస్తున్నట్లు తెలుస్తోంది. భూ కబ్జాదారుల్ని వెంటబెట్టుకుని మాజీమంత్రి కేటీఆర్ ప్రజలకు ఏలాంటి సందేశం ఇస్తారని ప్రశ్నిస్తున్నారట. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో పేదల భూములు కబ్జా చేసిన భూ బకాసురుడిగా పేరున్న శంకర్‌ నాయక్‌ను పక్కన పెట్టుకుని పేదల భూములు లాక్కొవాలనే సందేశం ఇస్తారా అని ప్రశ్నిస్తున్నారట. అటు తకెళ్ల పల్లిపైనా అంతే స్థాయిలో ఫైర్‌ అవుతున్నారట. ఎమ్మెల్సీగా తక్కెళ్లపల్లి లీలలు జిల్లా ప్రజలందరికీ తెలుసని గుర్తు చేస్తున్నట్టు తెలిసింది.

మొత్తంగా మానుకోటలో బీఆర్‌ఎస్‌ ధర్నాలో తమకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై జిల్లా ప్రెసిడెంట్‌ మాలోత్‌ కవిత కూడా తీవ్రంగా రగిలిపోతున్నట్టు తెలుస్తోంది. మహాధర్నాలో అన్ని తానై వ్యవహరించాల్సిన తనకు సరైనా గౌరవం ఇవ్వలేదని ఆమె తీవ్ర ఆవేదనలో మునిగిపోయారట.. అటు సత్యవతి రాథోడ్‌ సైతం ఈ విషయాన్ని పార్టీ అధినేత కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లే యోచనలో ఉన్నారట. చూడాలిమరి ఇకమీదట అయినా ఇలాంటి పొరపాట్లు జరగకుండా కేటీఆర్ జాగ్రత్త పడతారా..! లేకపోతే తనపని తాను చేసుకుపోతాడా అనేది తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే..

Also Read: Dharmana Prasad Rao: ధర్మాన అస్త్రసన్యాసం.. కొడుకు జనసేనలోకి!

Also Read: TELANGANA BJP: ఆపరేషన్ తెలంగాణ.. బీజేపీ కొత్తప్లాన్‌ ఇదే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News