Petition Filed In Telangana High Court Against Pushpa 2 The Rule Ticket Price Hikes: విడుదలకు సిద్ధమవుతున్న పుష్ప 2 ది రూల్ సినిమా బృందానికి భారీ షాక్ తగిలింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీగా పెంచిన టికెట్ల ధరలకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అడ్డగోలుగా సినిమా టికెట్ల ధరలు పెంచడంపై ఓ పిటిషన్ రావడం కలకలం రేపింది.
విడుదలకు సిద్ధం: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక నటించిన పుష్ప 2 ది రూల్ ఈనెల 5వ తేదీన విడుదల కానుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ సినిమాకు భారీగా టికెట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది.
సామాన్యుడికి కష్టం: రేవంత్ రెడ్డి పెంచిన ధరలతో సామాన్యుడు థియేటర్‌కు వెళ్లి సినిమా చూడలేని పరిస్థితి ఏర్పడింది.
అడ్డగోలుగా ధరలు: సినిమా ధరలు అడ్డగోలుగా పెంచుకోవడానికి అనుమతి ఇస్తుండడంతో ప్రేక్షకులకు వినోదం దూరమవుతుందనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ క్రమంలోనే ఒకరు హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం.
కోర్టులో పిటిషన్: సినిమా ధరలు పెంపుపై కల్పించుకోవాలని.. సామాన్యుడికి అందుబాటులోకి వినోదం తీసుకురావాలని పిటిషనర్ తన ఫిర్యాదులో కోరినట్లు తెలుస్తోంది.
విచారణ: ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
చిత్రబృందం షాక్: ఈ పిటిషన్ దాఖలవడంతో పుష్ప 2 ది రూల్ చిత్రబృందం షాక్‌కు గురైనట్లు తెలుస్తోంది. హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠ నెలకొంది.
ఉత్కంఠ: ఈ పిటిషన్‌తో చిత్రబృందంతోపాటు అల్లు అర్జున్ అభిమానులు షాక్‌కు గురయ్యారు. బెనిఫిట్ షోలు.. అదనపు షోలపై కూడా న్యాయస్థానం చర్చ జరుగుతోంది.