Donald Trump warning India: అమెరికా అధ్యక్షుడిగా త్వరలో ప్రమాణ స్వీకారం చేయబోతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాల పేరుతో భారత్ ను హెచ్చరించాడు. భారత్‌పై పరస్పర పన్ను విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ ఎలాంటి పన్ను విధిస్తుందో, అదే పన్నును భారతీయ ఉత్పత్తులపై కూడా విధిస్తాం వ్యాఖ్యలు చేశారు. కొన్ని అమెరికా ఉత్పత్తుల దిగుమతులపై భారత్ ‘అధిక సుంకాలను’ విధించడాన్ని ట్రంప్ చాలా కాలంగా వ్యతిరేకిస్తున్నారు. తన ఎస్టేట్ లో మీడియాతో మాట్లాడిన ట్రంప్ భారత్ మనపై 100 శాతం సుంకాలు విధించినప్పుడు మనం ఎందుకు విధించకూడదు అంటూ ప్రశ్నించారు.
మీడియాతో ట్రంప్ మాట్లాడుతూ.. 'వారు మాపై అధిక సుంకాలు విధిస్తే.. మేం కూడా వారిపై విధిస్తాం. వారు మాకు పన్ను, మేము కూడా పన్ను విధిస్తాం. వారు దాదాపు అన్ని ఉత్పత్తులపై అత్యధిక పన్నులు విధిస్తున్నారు. మేమేందుకు పన్ను విధించకూడదని ప్రశ్నించారు. 'భారతదేశం మనపై 100 శాతం పన్ను విధిస్తే.. వాటిపై మనం పన్ను వేయకూడదా?' కొన్ని అమెరికా ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తున్న దేశాల్లో భారత్, బ్రెజిల్ కూడా ఉన్నాయని ట్రంప్ అన్నారు. వారు మాపై పన్ను వేస్తే ఫర్వాలేదు కానీ మేం వారిపై కూడా అదే పన్ను విధిస్తాం' అని ట్రంప్ అన్నారు.
డొనాల్డ్ ట్రంప్ మాటలను తదుపరి వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ సమర్థించారు. ట్రంప్ ప్రభుత్వంలో అన్యోన్యత అనేది ఒక ముఖ్యమైన అంశం అని ఆయన అన్నారు. మీరు మాతో ఎలా ప్రవర్తిస్తారో అదే విధంగా మీరు మా నుంచి ఆశించాలి అని అన్నారు. లుత్నిక్ మాట్లాడుతూ, ఎవరు ఏది చేస్తే..తిరిగి వారికే అది చెందుతుంది అంటూ పరోక్షంగా భారత్ ను హెచ్చరించారు.
కాగా అధ్యక్ష ఎన్నికలకు ముందు కూడా ట్రంప్ పలు మార్లు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్, బ్రెజిల్, చైనా వంటి దేశాలపై అత్యధిక సుంకాలు విధిస్తానంటూ హెచ్చరించారు. తాజా వ్యాఖ్యలతో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత దీనిపై ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది.
అయితే 2019లో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో భారత్ ను ఆయన టారిఫ్ కింగ్ అనే పేర్కొన్నారు. ఈ క్రమంలోనే జీఎస్ పీ ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ హోదా వల్ల భారత్ మార్కెట్లోకి సమాన, హేతుబద్ధ సంధానత లభించలేదని ట్రంప్ అప్పట్లో ఆరోపించిన విషయం తెలిసిందే.
కాగా భారత్, అమెరికా సంబంధాలపై ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ యంత్రాంగం మాత్రం కీలక వ్యాఖ్యలు చేసింది. బైడెన్ పాలనలో ఇరుదేశాల మధ్య ఎలాంటి బంధం ఉండేదో అందరికీ తెలుసన్నారు. ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఇరు దేశాలు ఇలాంటి బలమైన బంధాన్ని కొనసాగించాలని ఆశాభావం వ్యక్తం చేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.