KTR ACB Case: ప్రపంచ ఖ్యాతి గుర్తింపు పొందిన ఫార్ములా ఈ రేసు నిర్వహించిన అంశంలో మాజీ మంత్రి కేటీఆర్‌పై అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసింది. నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై గవర్నర్ అనుమతితో ఏసీబీ కేసు నమోదు చేయడంతో తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేటీఆర్‌తోపాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌తోపాటు ఓ ప్రైవేటు సంస్థ సీఈఓ బీఎల్‌ఎన్ రెడ్డిపై కూడా కేసు నమోదవడం గమనార్హం. ఏసీబీ కేసు నమోదు కావడంతో నేడో.. రేపో కేటీఆర్ అరెస్ట్ ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి.
Also Read: Pending DAs: ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్.. పెండింగ్ డీఏలపై అసెంబ్లీలో చర్చ
ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందిన ఫార్ములా ఈ రేసును హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా 2023 ఫిబ్రవరిలో నిర్వహించిన విషయం తెలిసిందే. నాడు ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రిగా పని చేసిన కేటీఆర్ అనుమతి లేకుండా రూ.46 కోట్ల మేర విదేశీ కరెన్సీ చెల్లించారని ప్రధాన ఆరోపణ. కేటీఆర్‌పై కేసు నమోదుకు గవర్నర్ అనుమతి కోరగా.. నెల రోజుల తర్వాత అనుమతి లభించింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ మేరకు ఏసీబీ అధికారులు కేటీఆర్‌పై కేసు నమోదు చేశారు. కేటీఆర్‌తోపాటు నాటి పురపాలక శాఖ ముఖ్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డిపై ఎఫ్‌ఐఆర్ దాఖలైంది. కేటీఆర్‌ను ఏ వన్‌గా.. అరవింద్ కుమార్‌ను ఏ2గా, హెచ్‌ఎండీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డిని ఏ3గా పేర్కొన్నారు. మొత్తం నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Also Read: New Year 2025: న్యూ ఇయర్ వేడుకలకు పోలీసుల షాక్.. రాచకొండ పరిధిలో తీవ్ర ఆంక్షలు
తెలంగాణ ప్రభుత్వం, ఫార్ములా ఈ రేస్, ఏస్ నెక్ట్స్ సంస్థల మధ్య ఒప్పందంతో ఈ రేసు నిర్వహించారు. ప్రభుత్వ ప్రైవేటు ఆధ్వర్యంలో హుస్సేన్‌సాగర్ సచివాలయం ఎదుట ఫార్ములా రేస్ నిర్వహించారు. అయితే ఈ నిధుల కోసం మంత్రివర్గ ఆమోదం లేకుండా అప్పనంగా ప్రైవేటు సంస్థలకు పంపారని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ కేసు నమోదుపై కేటీఆర్ ఏనాడో సవాల్ చేశారు. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోరి అని కేటీఆర్ ఛాలెంజ్ చేసిన విషయం తెలిసిందే. కేటీఆర్‌పై కేసు నమోదుతో కాంగ్రెస్ వర్గాలు సంబరాల్లో మునిగినట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter