Heavy Rains in Andhra Pradesh: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం క్రమంగా బలపడుతోంది. దీంతో ఏపీలో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచింది. రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
తీవ్ర అల్పపీడనం ప్రభావంతో తీరం వెంబడి గరిష్ఠంగా గంటకు 60 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశాలున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో కళింగపట్నం, కాకినాడ, మచిలీపట్నం, విశాఖపట్నం, గంగవరం పోర్టులకు మూడో నంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశామన్నారు. సముద్రం అలజడిగా మారడంతో మత్స్యకారులు ఆదివారం వరకు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి, శ్రీకాకుళం, నెల్లూరు తదితర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. కళింగపట్నం, ఒంగోలు, కావలి, నెల్లూరు, కడప, తిరుపతి, విశాఖపట్నం, నరసాపురం తదితర ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు 2-5 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి.
ఈ సీజన్‌లో రాష్ట్రంలో 289 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కోస్తాంధ్రలో సాధారణం కంటే తక్కువగా 331.2 మి.మీ. నమోదైంది. రాయలసీమలో సాధారణం కంటే 43% ఎక్కువ వర్షం కురిసినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలియజేసారు. ఈ నెలాఖరు వరకు దక్షిణ భారతంలో సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశముందని ఐఎండీ పేర్కొంది. జనవరి వరకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1-2 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.
ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..
ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.