Narendra Modi Speech: మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి అభివృద్ధి పనులు, ప్రాజెక్టులు ప్రారంభోత్సవం చేపట్టేందుకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ప్రశంసలు కురిపించారు. ఏపీ అభివృద్ధికి తాను సహకరిస్తానని ప్రకటించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భుజం భుజం కలిపి పని చేస్తామని భరోసానిచ్చారు.
Also Read: Narendra Modi Visit: ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాని మోదీ భారీ కానుక.. రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టులు
విశాఖపట్టణంలో బుధవారం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో కలిసి ప్రధాని మోదీ రోడ్ షో చేపట్టారు. అనంతరం ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ తెలుగుతో ప్రసంగం ప్రారంభించారు. 'ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రేమ అభిమానానికి కృతజ్ఞతలు' అంటూ తెలుగులో చెప్పారు. మీ అందరి ఆశీర్వాదంతో 60 ఏళ్ల తర్వాత తొలిసారి మూడోసారి అధికారంలోకి వచ్చామని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్‌కు అన్ని రంగాల్లో మద్దతుగా నిలుస్తున్నాం అని తెలిపారు.
Also Read: PM Modi Visit: విశాఖలో త్రిమూర్తుల రోడ్ షో.. ఒకే వాహనంపై ప్రధాని, సీఎం, డిప్యూటీ సీఎం
భుజం భుజం కలిపి నడుస్తాం
'2047 నాటికి 2.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆంధ్రప్రదేశ్‌తో భుజం భుజం కలిపి నడుస్తాం. రూ.రెండు లక్షల కోట్ల ప్రాజెక్టులు ఏపీ వికాసానికి తోడ్పడతాయి' అని ప్రధాని మోదీ ప్రకటించారు. ఐటీ, టెక్నాలజీకి ఆంధ్రప్రదేశ్ ప్రధాన కేంద్రం కానుందని తెలిపారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు పునాదిరాయి వేశామని చెప్పారు. రైల్వే జోన్‌తో వ్యవసాయ, పర్యాటక రంగాలు ఊపందుకుంటాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 'ఆంధ్రప్రదేశ్‌లో 7 వందే భారత్ రైళ్లు కొనసాగుతున్నాయి. అమృత్ భారత్ కింద ఏపీలోని 70కి పైగా రైల్వే స్టేషన్లు ఆధునికీకరణ చేపట్టాం' అని ప్రధాని మోదీ వివరించారు.
ఎప్పుడూ అండగా
ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టుకున్న లక్ష్యాలకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలు, ఆశయాల సాధనకు మద్దతుగా నిలుస్తామని మోదీ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, మంత్రులు వంగలపూడి అనిత, టీజీ భరత్, లోకేశ్ తదితరులు పాల్గొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.