Telangana: తాజాగా 2,273 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. నిత్యం భారీ సంఖ్యలో కేసులు (CoronaVirus Positive cases in Telangana) నమోదవుతున్నాయి. కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుంటే.. మరోవైపు  పాజిటివ్ కేసుల సంఖ్య సైతం అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

Last Updated : Sep 16, 2020, 01:51 PM IST
  • తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిపోతోంది
  • తాజాగా 2,273 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
  • ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,62,844
Telangana: తాజాగా 2,273 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా పాజిటివ్ కేసులు (CoronaVirus Positive cases in Telangana) ఏ మాత్రం తగ్గడం లేదు. మంగళవారం రాత్రి 8 గంటల వరకు తాజాగా 2,273 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకూ నమోదైన  తెలంగాణ కోవిడ్19 కేసులు సంఖ్య (CoronaVirus cases in Telangana) 1,62,844కి చేరింది. గడిచిన 24 గంటల్లో 12 మంది కరోనాతో పోరాడుతూ చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 996కి చేరింది. Oxford Vaccine: క్లినికల్ ట్రయల్స్‌కు డీసీజీఐ అనుమతి

మొత్తం కేసులకుగానూ చికిత్స అనంతరం కోలుకున్న వారి సంఖ్య 1,31,447కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 30,401 యాక్టివ్ కేసులుండగా.. మరో 23,569 మంది ఐసోలేషన్‌లో ఉన్నారు. తెలంగాణలో ఇప్పటివరకూ 22,76,222 (22 లక్షల 76 వేలు) శాంపిల్స్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.  Gold Price Today: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

ఫొటో గ్యాలరీస్:

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYeR

Trending News