Sai Pallavi remuneration: సాయి పల్లవి పారితోషికం ఎంతో తెలుసా ?

రాహుల్ సంక్రిత్యన్ ( Rahul Sankrithyan ) డైరెక్షన్‌లో నాచురల్ స్టార్ నాని 'శ్యామ్ సింఘా రాయ్' ( Shyam Singha Roy ) అనే సినిమా చేయబోతున్నారనే విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

Last Updated : Sep 17, 2020, 01:00 AM IST
Sai Pallavi remuneration: సాయి పల్లవి పారితోషికం ఎంతో తెలుసా ?

రాహుల్ సంక్రిత్యన్ ( Rahul Sankrithyan ) డైరెక్షన్‌లో నాచురల్ స్టార్ నాని 'శ్యామ్ సింఘా రాయ్' ( Shyam Singha Roy ) అనే సినిమా చేయబోతున్నారనే విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో నాని సరసన సాయి పల్లవి ( Actress Sai Pallavi ) జంటగా నటించనుంది. Also read : Samantha Akkineni's next: మరో ఛాలెంజింగ్ పాత్రలో సమంత

ఈ చిత్రంలో సాయి పల్లవి ఒక కీలక పాత్రలో కనిపించనుంది. సాయి పల్లవిని ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కోసం ఒప్పించడానికి నిర్మాతలు చాలానే కష్టపడ్డారని తెలుస్తోంది. సాధారణంగా, సాయి పల్లవి ప్రాజెక్టులకు ఓకే చెప్పడానికి చాలా సమయం తీసుకుంటుంది అని ఇండస్ట్రీలో పేరుంది. ఈ చిత్రానికి ఒకే చెప్పడంలో కూడా అదే రిపీట్ అయింది. Also read : Red movie: రెడ్ మూవీ థియేటర్లలోనే అంటున్న రామ్

అయితే ఈ సినిమాకి సంబందించి ఓ గాసిప్ వినబడుతోంది. అదేంటంటే సాయి పల్లవికి ఈ సినిమా కోసం సీతారా ఎంటర్టైన్మెంట్స్ వారు 2 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్‌గా ( Sai Pallavi remuneration ) చెల్లిస్తున్నారని తాజాగా గాసిప్ వినిపిస్తోంది. 2 కోట్ల రూపాయలు అంటే చాలా భారీ రెమ్యునరేషన్. ఎంతో స్టార్‌డమ్ సంపాదించుకుంటే కానీ హీరోయిన్స్ రూ.2 కోట్లు చార్జ్ చేసే పరిస్థితి లేదని.. అలాంటిది సాయి పల్లవి అప్పుడే రూ.2 కోట్లు తీసుకుంటోందనే టాక్ వినిపిస్తోంది. Also read : Bigg Boss 4 Telugu love story: బిగ్ బాస్ హౌజ్‌లో ట్రయాంగిల్ లవ్ స్టొరీ

ఇప్పటికే మిడిల్ క్లాసు అబ్బాయి సినిమాతో నాని, సాయి పల్లవి హిట్ పెయిర్‌గా నిలిచారు. ఈ సినిమాలో వాళ్ల కెమిస్ట్రీ ఎలా పండబోతుందో చూడాలి మరి. Also read : Pan India: ప్యాన్ ఇండియాపై ఫోకస్ పెట్టిన తెలుగు స్టార్స్, దర్శకనిర్మాతలు

మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYeR

Trending News