కరోనా వ్యాక్సిన్ ( Corona vaccine ) అభివృద్ధి చేసేది ఎక్కడైనా సరే...తయారయ్యేది, మార్కెట్ చేసేది మాత్రం భారత్ నే. ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ ( Oxford vaccine ) తో ఒప్పందమైన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఇప్పుడు మరో అమెరికన్ కంపెనీ కరోనా వ్యాక్సిన్ తో డీల్ కుదుర్చుకుంది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ( Coronavirus ) విజృంభణ కొనసాగుతోంది. ఈ మహమ్మారిని అంతం చేసేందుకు వివిధ కంపెనీల వ్యాక్సిన్ లు ట్రయల్స్ ( Vaccines in trials ) లో ఉన్నాయి. ఈ నేపధ్యంలో ప్రపంచంలో వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్న కంపెనీలన్నీ...భారతదేశం వైపే చూస్తున్నాయి. కారణం ప్రపంచమంతటికీ వ్యాక్సిన్ తయారు చేసి పంపిణీ చేయడమంటే భారత్ లోని కంపెనీలకే సాధ్యం మరి. ఇప్పటికే పూణేకు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ( Serum institute of india ) సంస్థ...ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనెకా ( oxford-AstraZeneca vaccine ) వ్యాక్సిన్ ఉత్పత్తి, పంపిణీ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ మూడోదశ క్లినికల్ ట్రయల్స్ ను భారత్ లో సీరమ్ ఇనిస్టిట్యూట్ నే నిర్వహిస్తోంది. తాజాగా రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి ( Russia vaccine sputnik v ) ఉత్పత్తి చేసి మార్కెటింగ్ చేసేందుకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ తో ( Dr Reddys labs ) భారీ ఢీల్ కుదిరింది. ఇప్పుడు మళ్లీ సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో అమెరికన్ కంపెనీ ఒప్పందం చేసుకుంది.
అమెరికాకు చెందిన నోవావాక్స్ వ్యాక్సిన్ ( novanox vaccine ) ప్రయోగాల్ని సీరమ్ ఇనిస్టిట్యూట్ త్వరలో చేపట్టనుంది. ఆగస్టులో ఈ ఒప్పందమైంది. నోవావాక్స్ కంపెనీ వ్యాక్సిన్ ఎన్ వీఎక్స్ -కోవి 2373 యాంటిజెన్ భాగాన్ని సీరమ్ ఇనిస్టిట్యూట్ తయారు చేయనుంది. అక్టోబర్ నెలలో దీని ప్రయోగాలు జరగనున్నాయి.నోవావాక్స్-సీరం ట్రయల్స్.. పూణేలోని ఐసీఎంఆర్-నేషనల్ ఎయిడ్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యాన జరగనున్నాయి. కోవిడ్ వ్యాక్సిన్ తయారీ సామర్థ్యాన్ని ఏటా 2 బిలియన్ మోతాదులకు రెట్టింపు చేయాలని యోచిస్తున్నామని నోవావాక్స్ అధ్యక్షుడు స్టాన్లీ సి ఎర్క్ తెలిపారు. దీనికోసం వివిధ ఫార్మా సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నట్టు చెప్పారు. ప్రస్తుతం రెండోదశ క్లినికల్ ట్రయల్స్ లో ఉన్న వ్యాక్సిన్ను చాలా వేగంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో ఫేజ్ 3 ట్రయల్స్ ప్రారంభిస్తామన్నారు. Also read: Rajyasabha: ఏపీలో న్యాయవ్యవస్థ నిష్పక్షపాతంగా ఉండటం లేదు: Vijaysai reddy