ఉత్తరప్రదేశ్ హత్రాస్ గ్యాంగ్ రేప్ మరియు హత్య కేసు (Hathras Gang Rape Case)లో ఆశ్చర్యకరమైన పరిణామం చోటుచేసుకుంది. తాము నిర్దోషులమని, అన్యాయంగా తమపై కేసు బనాయించారంటూ ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు నిందితులు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SP)కి లేఖ రాశారు. సందీప్, రాము, లవకుష్, రవిగా గుర్తించిన హత్రాస్ కేసు (Hathras Case) నిందితులు తమ వేలి ముద్రలు వేసిన ఓ లేఖను బుధవారం ఎస్పీకి పంపారు.
ప్రధాన నిందితుడు సందీప్ లేఖలో రాసిన వివరాల మేరకు.. తాను 19 ఏళ్ల యువతిపై ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదని పేర్కొన్నాడు. బాధితురాలు తనకు తెలుసునని, ఆమెతో తనకు పరిచయం ఉందన్నాడు. ఆమె మరణానికి బాధితురాలి తల్లి, సోదరుడు ఇద్దరే కారణమని, తమను అన్యాయంగా కేసులో ఇరికించారని లేఖలో పేర్కొన్నాడు.
మరోవైపు ప్రధాన నిందితుడు సందీప్, బాధితురాలి సోదరుడు స్నేహితులు అని వారు తరచుగా ఫోన్‌లో మాట్లాడుకునేవారని రిపోర్టులు సైతం బయటకు వచ్చాయి. అక్టోబర్ 2019 నుంచి మార్చి 2020 వరకు వారిద్దరి మధ్య దాదాపు ఐదారు గంటల పాటు ఫోన్ సంభాషణ జరిగింది. అయితే తనకు నిందితుడితో సంబంధం లేదని, అతడితో మాట్లాడలేదని బాధితురాలి సోదరుడు చెబుతుండటం గమనార్హం.
కాగా, దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన హత్రాస్ (Harthras Case) లో 19 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం జరిగిందన్న ఆరోపణల కేసు దర్యాప్తు కోసం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (UP CM Yogi Adityanath) మొదట సిట్ (SIT) ను ఏర్పాటు చేశారు. అనంతరం కేసు విచారణను సీబీఐ (CBI)కి అప్పగించడం తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe