ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) ఆలోచన నిజమౌతోంది. రాష్ట్రంలో దశలవారిగా మద్యపానం నిషేధించే ( Prohibition ) దిశగా చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గిపోయాయి.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్ ( ys jagan ) దశలవారీగా మద్యపానాన్ని నిషేధిస్తానని హామీ ఇచ్చారు. అధికారంలో రాగానే ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. ముందుగా బెల్టుషాపుల్ని పూర్తిగా తొలగించేశారు. అనంతరం మద్యం దుకాణాల్ని పరిమితం చేశారు. తరువాత దశలో మద్యం అమ్మకాల్ని తగ్గించడానికి యోచించారు. లాక్డౌన్ అనంతరం మద్యం దుకాణాల్ని తెర్చినప్పుడు ధరల్ని ఏకంగా 75 శాతం పెంచుతూ అందరికీ షాక్ ఇచ్చారు. వైఎస్ జగన్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఒక్కసారిగా విమర్శలు చెలరేగాయి. అయితే ఈ విధానం బాగా పనిచేస్తున్నట్టు తాజా అధ్యయనం ప్రకారం తెలుస్తోంది.
ఏపీ ఎక్సైజ్ శాఖ ( Ap Excise Department ) విడుదల చేసిన తాజా గణాంకాలు ప్రభుత్వ చర్యలు సత్ఫలితాలనిస్తున్నట్టు అర్ధమౌతోంది. గత ఏడాది మద్యం అమ్మకాలు 10 వేల 282 కోట్లు కాగా..ఈ ఏడాది 7 వేల 706 కోట్లకు తగ్గిపోయింది. మొత్తంగా మద్యం అమ్మకాలు 25 శాతానికి పైగా తగ్గాయని తెలుస్తోంది. అటు బీర్లలో అయితే ఏకంగా 89 శాతం వరకూ అమ్మకాలు తగ్గాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మద్యం రేట్లు పెంచడంతో పాటు కోవిడ్ వైరస్ విజృంభణ కూడా మద్యం అమ్మకాల తగ్గుదలకు ఓ కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విధానం ఇలాగే కొనసాగితే..మరికొద్ది రోజుల్లో మద్యం అమ్మకాలు భారీగా తగ్గే అవకాశం ఉంది. ఈ లెక్కన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన కొత్త మద్యం పాలసీ ( New Excise policy ) విజయవంతమైనట్టే. Also read: Apex Council Effect: జగన్ రెడ్డికు మద్దతు..కేసీఆర్ పై విమర్శలు
AP New Excise policy: సత్ఫలితాలనిస్తున్న విధానం, తగ్గిన అమ్మకాలు
ఏపీలో సత్ఫలితాలనిస్తున్న నూతన మద్యం పాలసీ
25 శాతం తగ్గిన మద్యం అమ్మకాలు
ఏపీలో దశలవారీ మద్య నిషేధం